twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: షో నుంచి వెళ్లి తప్పు చేశా.. అతన్ని ఇప్పటికి తిడతాను: ధన్ రాజ్

    |

    జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకుని లాభపడిన కమెడియన్స్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కూడా మంచి సినిమా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. అయితే ఆ షో నుంచి కొన్నిసార్లు కమెడియన్స్ వెళ్లిపోవడంపై అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న టీమ్ లీడర్స్ కొన్నాళ్ళకు బయటకు వెళ్ళడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధన్ రాజ్ షో నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    అంచనాలు లేవు

    అంచనాలు లేవు

    2013లో జబర్దస్త్ మొదలైనప్పుడు ఎవరికి కూడా ఆ షోపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే అంతకుముందు కూడా కొన్ని కామెడీ షోలు వివిధ రకాల ఛానెల్స్ లో వచ్చాయి. ఈటీవీ ఛానెల్ రేటింగ్స్ కూడా అప్పట్లో చాలా తగ్గిపోయాయి. అప్పుడే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తప్పకుండా జబర్దస్త్ సక్సెస్ అవుతుందని పెద్దగా హైప్ లేకుండానే స్టార్ట్ చేశారు.

    రికార్డులను బ్రేక్ చేస్తూ

    రికార్డులను బ్రేక్ చేస్తూ

    ఇక వారం తిరిగేసరికి జబర్దస్త్ షో ఊహించని రేంజ్ లో రేటింగ్స్ అందుకుంది. అసలు షో ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందని ఎవరు ఊహించింది లేదు. టెలివిజన్ చరిత్రలోనే గత రికార్డులను బ్రేక్ చేస్తూ అత్యధికంగా టీఆర్పీ ని సొంతం చేసుకుంది. ఇక ధన్ రాజ్, వేణు వండర్స్, చలాకి చంటి, రాఘవ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు షోలో కమెడియన్స్ గా స్టార్ రేంజ్ కు వెళ్లిపోయారు.

    బయటకు వెళ్లిపోవడం

    బయటకు వెళ్లిపోవడం

    ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు జబర్దస్త్ మంచి ఊపుమీదున్న సమయంలో హఠాత్తుగా కొందరు టీమ్ లీడర్స్ బయటకు వెళ్లిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక కొత్త వాళ్ళు ఆ అవకాశాలను ఉపయోగించుకుని జబర్దస్త్ కు మరింత బూస్ట్ ఇచ్చారు. వేణు టీమ్ నుంచి వచ్చిన సుధీర్, గెటప్ శ్రీను లకు మంచి క్రేజ్ అయితే వచ్చింది.

    ధన్ రాజ్ క్లారిటీ

    ధన్ రాజ్ క్లారిటీ

    అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ధన్ రాజ్ జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. అలాగే వేణు కూడా బయటకు వెళ్లిపోవడానికి పరోక్షంగా మరో కారణం అని కూడా చెప్పాడు. ఆ రోజు అతను చెప్పినట్లు చేయకుండా ఉంటే బాగుండేది అని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినందుకు ఇప్పటికి కూడా బాధపడుతున్నట్లు ధన్ రాజ్ తెలిపాడు.

    మరో ఛానెల్ లో..

    మరో ఛానెల్ లో..

    జబర్దస్త్ చేస్తున్నప్పుడు మరో ఛానెల్ లో యాంకర్ గా చేసే అవకాశం రావడంతో అక్కడికి వెళదాం అని వేణు సలహా ఇచ్చాడు. అయితే జబర్దస్త్ లో కామెడీ అక్కడ యాంకర్ గా చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అవ్వదని వేణు అన్నాడు. దీంతో నేను షూట్ చేసిన తరువాత జబర్దస్త్ యాజమాన్యంతో చెప్పగానే వాళ్ళు రెండిట్లో కనిపిస్తే ఆ ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుంది అని అనడంతో మేము మళ్ళీ అక్కడే చేయాల్సి వచ్చిందని అన్నారు.

    ఇప్పటికి అతన్ని తిడతాను

    ఇప్పటికి అతన్ని తిడతాను

    ఇక మళ్ళీ జబర్దస్త్ లోకి వెళ్లాలని అనుకున్నప్పటికి అప్పటికే అక్కడ తమ గ్రూప్ లో ఉన్న వారిని టీమ్ లీడర్స్ గా చేశారు. అప్పుడే సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను ఇతర టీమ్ సభ్యులు టీమ్ గా సెట్ అయ్యారు. ఇక మళ్ళీ మేము వెళితే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అలాగని టీమ్ లో ఒక కమెడియన్ గా చేయలేము. ఏదేమైనా కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినందుకు నేను ఇప్పటికి వేణుని తిడతానని ధన్ రాజ్ అన్నాడు.

    English summary
    Dhan raj clarification on jabardasth issue and comedian venu topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X