ఆయన వల్లే ఇళ్లు, ఫుడ్, కార్లు.. అలా జబర్దస్త్ టు అదిరింది.. అసలు విషయాలు బయటపెట్టిన ధన్‌రాజ్
బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసిన జబర్దస్త్ గురించి, అందులోని ఆర్టిస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ అనే వేదిక నుంచి ఎంతో మంది వెండితెరకు పరిచయమయ్యారు. జబర్దస్త్ షో ఇంకెంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. దాదాపు ఏడేళ్లు న్యాయనిర్ణేతగా ఉన్న నాగబాబు జబర్దస్త్‌ను వీడటం, కొత్త షోను ప్రారంభించడం పాత ఆర్టిస్ట్‌లు మళ్లీ ఒక్క చోటకు చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీటిపై ధన్‌రాజ్ తాజాగా మాట్లాడుతూ.. అసలు విషయాలను బయటపెట్టాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

అలా జబర్దస్త్ మొదలు..
జగడం, పరుగు, గోపీ గోపిక గోదావరి, భీమిలి కబడ్డీ, పిల్లా జమీందార్ వంటి సినిమాలతో అప్పటికే ఓ గుర్తింపు వచ్చిందని మేనేజర్ ఏడుకొండలు తమను కలిసి ఓ కాన్సెప్ట్ చెప్పాడని తెలిపాడు. అయితే చంద్ర, రోలర్ రఘు, వేణును తానే ఒప్పించానని, రెమ్యూనరేషన్ కూడా తానే మాట్లాడానని పేర్కొన్నాడు. అలా జబర్దస్త్ మొదలైందని తెలిపాడు.

ఫస్ట్ స్కిట్ నాదే.. విన్నర్‌నూ నేనే
మొదటగా పదమూడు ఎపిసోడ్‌లను చెప్పారని,అయితే మొదటి రోజు జబర్దస్త్ కెమెరా రోల్ అయింది తన మీదేనని, ఫస్ట్ స్కిట్ కూడా తనదేనని, విన్నర్ కూడా తానేనని తెలిపాడు. ఆ ఒక్క క్రెడిట్ ఎప్పటికీ నిలిచిపోతుందని గర్వంగా చెప్పుకున్నాడు.

మధ్యలో అలా..
తాము చాలా సార్లు మధ్య మధ్యలో వచ్చి వెళ్లామని, ఓ సారి జబర్దస్త్ ఫస్ట్ డైరెక్టర్ సంజయ్, ఏడుకొండలు బయటకు వచ్చేశారు. వారితో కలిసి ఆలీ టాకీస్ షో చేశామని తెలిపాడు. ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ కూతురు దీప్తికి చెప్పామన్నాడు. అయితే ఆ షో పూర్తయ్యాక జబర్దస్త్‌లో రమ్మన్నారని తెలిపాడు. అయితే ఆ సమయంలో అప్పటి వరకు తమ వద్ద కంటెస్టెంట్లుగా ఉన్న సుధీర్, రాకేష్, గెటప్ శీను ఇలా టీమ్ లీడర్స్ అయ్యారు.. మళ్లీ తాము వెళ్లి అడిగితే.. బాగుండదేమోనని ఊరుకున్నట్లు తెలిపాడు.

ఎక్స్‌ట్రా పెట్టినప్పుడు కూడా..
ఎక్స్ ట్రా జబర్దస్త్ పెట్టినప్పుడు కూడా తాము వెళ్లామని, అయితే ఉన్నవారిని తీసివేయలేక వారి బాధలేవో వారికి ఉన్నాయి.. తరువాత చూద్దామన్నారు.. అలా అలా గ్యాప్ పెరుగుతూనే వచ్చిందని తెలిపాడు. అయితే ఓ సారి సడెన్‌గా నాగబాబు, నితిన్-భరత్ బయటకు వచ్చేశారని తెలిసింది.
Recommended Video

ఆయన వల్లే ఫుడ్, ఇళ్లు, కార్లు..
అలా బయటకు వచ్చిన నాగబాబు తమకు ఫోన్ చేశారని.. అదిరిందిలో చేయమని అడిగినట్టు తెలిపాడు. జబర్దస్త్‌లో ఉన్న లీడర్స్ అంతగా ఎదిగారంటే.. ఇళ్లు, ఫుడ్, కార్లు ఉన్నాయంటే అంతా ఆయన వల్లే అంతా అని అలాంటి వారు పిలిచాక వెళ్లకుండా ఉంటామా? అని అన్నాడు. అలా అదిరిందిలోకి వచ్చామని తెలిపాడు.


Click it and Unblock the Notifications











