Guppedantha Manasu June 1st: నిజంగానే చనిపోయిన రిషి.. కన్నీటి పర్యంతమవుతున్న వసు.. అండగా ధరణి!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ధరణి, దేవయానిలు వచ్చి తమ ఇంట్లో జరిగే పూజకు రావాలని చెబుతారు. బొట్టు పెట్టి మరీ పిలుస్తారు. వసును పదే పదే రమ్మని ధరణి చెప్పగా.. నీకోసం తాను ఎక్కడికైనా వస్తుందని దేవయాని చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోగానే.. మహేంద్ర మాత్రం ఇంత సడెన్ గా దేవయాని వ్రతం చేయించడం నాకేదో అనుమానంగా ఉందని అంటాడు. ఏమో మామయ్యా.. నిజమే అయ్యుండచ్చు, ఏదైనా తిరకాసు ఉంటే ముందే ధరణి మేడమ్ చెప్పేవాళ్లు కదా అంటూ వసు వివరిస్తుంది. ఆ తర్వాత అనుపమ నువ్వు వస్తావా అంటే నేను రానని చెబుతుంది. అలాగే వసు నేను వెళ్తానంటుంది. ఓకే అంటాడు మహేంద్ర.
ఆ తర్వాత ధరణి, శైలేంద్రలను చూపిస్తారు. పూజ జరుగుతుండగా.. దేవయానియే దగ్గరుండి వ్రతం జరిపిస్తుంది. అక్కడకు వచ్చిన వాళ్లంతా ఇలా జరిపించడం మంచదని.. తమకు తెలిసిన వాళ్లు కూడా ఆ వ్రతం చేసుకున్నట్లు చెబుతారు. మరి సంతానం అయిందా అంటే మొన్నే చేశారు.. ఇంకా ఫలితం ఏం లేదని అంటారు. అప్పుడే వసు ఇంకా రావట్లేదేంటని చూస్తుంది దేవయాని. అలాగే ఆమె అనుపమకు ఫోన్ చేస్తుంది. ఇంకా రావట్లేదా అనుపమ అనగా.. ఆమె ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలుసుకుని ఊరుకుంటుంది. అప్పుడే వసు ఎంట్రీ ఇస్తుంది. మేడమ్ రావట్లేదు నేనే వచ్చానంటుంది. మంచి పని ఆమె రాకపోవడమే మంచిదని అంటుంది దేవయాని. ఆ తర్వాత దంపతులను పూజలో కూర్చోబెడతారు పంతులు. అలా చక్కగా పూజ జరిపిస్తారు. కుంకుమ భరిణ కావాలని అనగా.. నేనెల్తానని వసు అంటుంది. దేవయాని మాత్రం తానే వెళ్లి తీసుకు వస్తానంటుంది.

ఆ తర్వాత శైలేంద్రతో ధరణికి బొట్టు పెట్టిస్తారు. ఇలా పూజ చాలా చక్కగా జరుగుతుంది. ఉపవాసం ఉన్నావు కదా అని అడిగి మరీ తాంబూలాలు ఇవ్వాలని సూచిస్తారు పంతులు. ఆ తర్వాత ధరణికి తాంబూలాలు ఇవ్వమని చెబుతుంది దేవయాని. అలా ధరణి అక్కడకు వచ్చిన పెద్దలందరికీ తాంబూలాలు ఇస్తుంది. అందరికీ ఇచ్చావా అని అడుగుతూనే.. నీ తోటి కోడలుకు కూడా ఇవ్వు అంటుంది. అలా బొట్టు పెడుతుండగానే.. దేవయాని అక్కడకు వచ్చిన ఒకామెకు సైగ చేస్తుంది. వెంటనే ఆమె వసుకు తాంబూలం ఇవ్వబోతుంటే ఆపేస్తుంది. ఆమెకు ఇవ్వడం ఏంటంటూ అడుగుతుంది పెద్ద ముత్తైదువ. ఆ అమ్మాయి రిషి భార్య వసుయే కదా, కాలేజీ ఎండీగా చేస్తుంది కదా అని అంటారు. మరి మీ రిషి చనిపోతే ఆమె తాంబూలం ఎలా తీసుకుంటుందని ప్రశ్నిస్తారు. అప్పుడే వసు చాలా ఎమోషనల్ అవుతూ.. తన భర్త చనిపోలేదని, రిషి సార్ బతికే ఉన్నారని చెప్పుకొస్తుంది.
అదేంటి దేవయాని గారు రిషి చనిపోయాడుగా.. చనిపోలేదంటుందేంటి ఈ అమ్మాయి అని అడుగుతారు. మాకు చెప్పకపోయినా అతడు ఎక్కడున్నాడో మీకైనా తెలుసా అంటూ అడుగుతారు. అప్పుడే దేవయాని కల్పించుకుని.. మా రిషి కనిపించకుండా పోయాడనేది వాస్తవం, పోలీసులు చనిపోయాడని నిర్దారించడం వాస్తవం అని, రిషి చనిపోయినట్లు తాము నమ్ముతున్నామని అయితే వసు మాత్రం దాన్ని నమ్మట్లేదని చెప్పుకొస్తుంది. దీంతో అంతా ఇలా ఎలా నమ్ముతారంటూ ఫైర్ అవ్వగా.. వసు ఏడ్చేస్తుంది. అప్పుడే ధరణి కల్పించుకుని.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది మాత్రమే చూస్కొని వెళ్లిపోమంటుంది. అదేంటి ఇలా అవమానిస్తున్నారని అనగా.. నేనేం తప్పు చేయట్లేదని చెప్పుకొస్తుంది. ఎవరేమన్నా వసుకు తాంబూలం ఇస్తానని ధరణి తెగేసి చెబుతుంది.
నువ్వు ఆమెకు తాంబూలం ఇస్తే ఈ ఇంటికి అరిష్టం జరుగుతుందని అంతా చెబుతున్నా.. తాను మాత్రం కచ్చితంగా ఇస్తానని వివరిస్తుంది. తనకు పిల్లలు పుట్టకపోయినా, వ్రత ఫలితం రాకపోయినా సరేనని.. కానీ వసుకు మాత్రం తాంబూలం ఇస్తానంటుంది. అలాగే రిషి చనిపోలేదని, బతికే ఉన్నాడని తాను కూడా నమ్ముతున్నట్లు చెప్పుకొస్తుంది. కచ్చితంగా రిషి త్వరలోనే తిరిగ వస్తాడని.. వసు వంద శాతం ముత్తయిదవ అని ఆమెకు తాంబూలం ఇవ్వడంలో తనకు ఏమాత్రం అభ్యంతరం లేదంటుంది. అప్పుడే అమ్మా ధరణి అనగా.. మీకేమైనా అభ్యంతరమా అంటుంది. అతిథులు నొచ్చుకునేలా మాట్లాడొద్దు అనగా.. ధరణి తాంబూలం ఇస్తుంది. వసు ఏడుస్తూ ఉండగానే.. తీసుకో, తీసుకో అంటూ తాంబూలం ఇస్తుంది. ఇక అక్కడి నుంచి వసు వెళ్లిపోతుంది.
అప్పుడే అక్కడకు వచ్చి గెస్టులు.. ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోయినా, తీసుకునే వాళ్లకు అయినా ఉండాలి కదా అంటారు. అలా అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఏంటి అత్తయ్యా షాక్ అయ్యారా, మీ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధ పడుతున్నారా అంటూ అడుగుతుంది. వసును కావాలనే బాధ పెట్టాలని ప్లాన్ చేశారు కదా అంటుంది. మీరే కావాలని చేశారనగా.. దేవయాని మాత్రం తాను ఏం చేయలేదంటుంది. మీ గురించి నాకే బాగా తెలుసు అని.. మామయ్య లేనప్పుడు ఇలాంటి పూజ చేయాలన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందని.. కానీ మా బాగు కోసం ఆలోచిస్తున్నారేమోననే చిన్న ఆశతోనే పూజకు ఒప్పుకున్నానని చెబుతుంది. మీకు వయసు అవుతుంది, ఇలాంటివి మానేస్తే మంచిదని చెప్పుకొస్తుంది. కానే వార్నింగ్ ఇస్తున్నావా అని దేవయాని అనగా.. మీరు బాగుండాలనే ఇలా చెబుతున్నానంటుంది.
అలాగే జాగ్రత్తగా ఉండమని కూడా సూచించి మరీ వెళ్లిపోతుంది. అప్పుడే శైలేంద్ర ఇలాంటివి చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని అంటాడు. దీని వల్ల వసు బాధ పడడం కంటే కూడా ధరణి ముందు చీప్ అయిపోయామంటాడు. అసలు నువ్వు ఎలా విలన్ వి అయ్యావని అడుగుతాడు. నాతో వస్తే నీకు చూపిస్తాను రా అంటూ మరో చోటుకు తీసుకు వెళ్తుంది దేవయాని. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











