Guppedantha Manasu June 3rd: వారం రోజుల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్న రిషి.. క్లారిటీ ఇచ్చేసిన వసు!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర ఇలాంటివి చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని అంటాడు. దీని వల్ల వసు బాధ పడడం కంటే కూడా ధరణి ముందు చీప్ అయిపోయామంటాడు. అసలు నువ్వు ఎలా విలన్ వి అయ్యావని అడుగుతాడు. నాతో వస్తే నీకు చూపిస్తాను రా అంటూ మరో చోటుకు తీసుకు వెళ్తుంది దేవయాని. ఇక ఆ తర్వాత తాంబూలం తీసుకున్న వసు అంటికి చేరుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే అనుపమ వచ్చి ఏమైందమ్మా ఎందుకేడుస్తున్నావు అంటుంది. అలాగే మహేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అనగా.. ఏం లేదంటుంది. ఎంత అడిగినా చెప్పదు. కానీ చివరకు మహేంద్రే తాను కనుక్కుంటానంటూ ఫోన్ చేస్తాడు. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయగా.. నేనో విషయం తెలుకుందామని ఫోన్ చేశానంటాడు.
వసు మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా అనగా.. అక్కడ జరిగిందంతా చెప్పుకొస్తుంది. అదంతా విన్న మహేంద్ర నా కోడలిని అవమానించడానికి వారికి ఎన్ని గుండెలు, వారిని ఇలాగే వదిలేస్తే ఏమైనా చేస్తారంటూ ఫైర్ అవుతాడు. అక్కడకు వెళ్తానంటూ లేస్తాడు. కానీ అప్పుడే అనుపమ లేచి గొడవ అవుతుందని వద్దని వారిస్తుంది. కానీ వాళ్లకు బుద్ధి చెప్పాలని, తన కోడలిని అవమానించిన వాళ్లను వదలను అంటాడు. వసు కూడా వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెను తీసుకుని వస్తుంటాడు. అప్పుడే శైలేంద్ర, దేవయానిలు ఎంట్రీ ఇస్తారు. ఈ ప్రసాదం మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానంటూ చెప్పగా.. మీరు వచ్చిన పర్పస్ వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు అంటాడు. మీకు బుద్ధి ఉండాలంటే ఇంటికి పిలిచి అవమానించడానికి అంటూ ఫైర్ అవుతాడు.

కానీ శైలేంద్ర మాత్రం బుద్ధి గిద్ధి అంటున్నారేంటి, వసు అలిగి వచ్చినా, మీరు రాకపోయినా ప్రసాదం తీసుకు వస్తే అలా చేశారేంటి అంటూ అంటాడు. ఆ తర్వాత మహేంద్ర వసుకు అవమానం చేశారుగా అనగా.. దేవయాని మాత్రం నేనేమైనా అన్నానా అంటుంది. అందుకు కారణం మీరే.. మీరే వెనక ఉండి ఈ కథ నడిపించారంటూ చెప్పుకొస్తాడు. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ గా చెప్పేస్తాను, మొహం మీదే అంటానంటూనే మరి రిషి ఎక్కడ అంటూ అడుగుతుంది దేవయాని. దానికి వసు, మహేంద్ర, అనుపమలు ఫైర్ అవుతారు. కానీ దేవయాని మాత్రం రిషి చనిపోయాడు.. అది జీర్ణించుకోలేని మీరు అతడు బతికే ఉన్నాడంటున్నారని అంటుంది. ఆపండి అని వసు అనగా.. మరి 3 నెలల్లో తీసుకు వస్తానని చెప్పిన రిషి జాడ ఇప్పటి వరకు ఎందుకు లేదంటుంది.
మూడు నెలల గడువుకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉందని.. అది గుర్తింది కదా నీకు అంటూ చెప్పుకొస్తుంది. రిషిని వెతకడం మానేసి.. మను మంచోడు, ఆయనను కాపాడాలి, అటు కాలేజీ, ఇటు ఇంట్లో ఎప్పుడు అదే ధ్యాస కదా అంటుంది. మను గోలలో పడి రిషిని మర్చిపోయావా అంటూ చెప్పుకొస్తుంది. రిషిని పెంచిన నాకే అన్నం సహించట్లే, ఎప్పుడెప్పుడు చూడాలి అని ఆశగా ఉందంటూ కానీ కన్నతండ్రివి అయిన నీవు ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. రిషి కనిపించట్లేదన్న బాధ కొంచమైనా ఉందా అని అంటుంది. ఆ మను వచ్చినప్పటి నుంచి మీరు పూర్తిగా రిషిని మర్చిపోయారంటూ వివరిస్తుంది. మను పక్కన ఉంటే రిషిలాగే అనిపిస్తుందని.. ఆ ప్రేమనంత వీడిపైనే చూపిస్తున్నావంటుంది. అతడిని జైలు నుంచి విడిపించడానికి చేసిన ప్రయత్నంలో 5 శాతం దీనిపై పెట్టినా రిషి ఎప్పుడో దొరికేవాడని అంటుంది.

సింపుల్ గా రిషి లేడని ఒప్పేసుకుంటే సరిపోతుంది కదా అని అనగా.. 5 రోజుల్లో రిషి సార్ ను తీసుకు వస్తానని అంటుంది. కచ్చితంగా వారం రోజుల్లో రిషి సార్ ను తీసుకు వస్తానని వసు ప్రామిస్ చేస్తుంది. తీసుకురాలేకపోతే నీవు అన్నమాట మీద నిలబడతావా అంటుంది. అసలు నీకు ఆ మాట ఏంటో గుర్తుందా అని అనగా.. గుర్తుంది అని వసు చెబుతుంది. గడువు పూర్తయ్యేలోపు రిషి సార్ ను తీసుకు రాకపోతే కాలేజీని వదిలి ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్లిపోతానన్నానని చెప్పుకొస్తుంది. రిషి సార్ ను తీసుకు రాలేకపోతే కచ్చితంగా ఇదే చేస్తానంటుంది. మరి నువ్వేమంటావు మహేంద్ర అనగా.. వసు మాటే నా మాట అంటుంది. అసలు అనుపమ ఎవరు, ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుందని అడుగుతుంది. ఫ్రెండ్ అంటే ఓ నాలుగు రోజులు ఉండాల్సిందని కానీ.. ఆమె జగతి స్థానంలోకి ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది.

అసలు మీ మధ్య ఉన్న బంధం ఏంటంటూ దేవయాని అంటుంది. నా నోటితో నేను చెప్పలేను మీ బంధం గురించి అనగా.. మితిమీరు మాట్లాడుతున్నావంటూ అనుపమ చెబుతుంది. మహేంద్ర ఇది కరెక్టు కాదంటూ వివరిస్తుంది. ఈమెకు కొడుకు ఉన్నాడు, కానీ ఆమె తండ్రి ఎవరో తెలియదు అంటూ ఫైర్ అవుతుంది. ఇలాంటి ఆడదాన్ని ఏమంటారో తెలుసా అని అనగానే.. మను ఎంట్రీ ఇస్తాడు. ఇక చాలు ఆపండి అంటూ లోపలికి వచ్చి ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. దీంతో దేవయాని నువ్వొచ్చావా, వస్తావని అనుకున్నానును.. నిన్ను చూస్తేనే నాకు జాలేస్తుందంటుంది. అనుపమ మేడమ్ ను మరొక్క మాట అన్నా నేను ఊరుకోనంటాడు మను. కానీ ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుందని తిరిగి ప్రశ్నిస్తారు. చెప్పు తనిక్కడ ఎందుకు ఉంటుందని అంటాడు.

పోనీ ఆమె ఇక్కడ ఏమైనా తలదాచుకోవడానికి వచ్చింది అనుకుంటే దిక్కులేనిది ఏం కాదు కదా.. తన తండ్రి విశ్వనాథం ఉన్నారు, అక్కడ ఉండొచ్చు కదా అంటూ దేవయాని చెప్పుకొస్తుంది. కన్నబిడ్డవు నువ్వు ఉన్నావు కదా.. నీతో ఉండాలి కదా మరి ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటూ అడుగుతుంది. చివరకు నిన్ను కొడుకులా కూడా చూడట్లేదు, అమ్మా అని పిలిపించుకోవడానికి కూడా సిద్ధంగా లేదని చెబుతుంది. అది మా పర్సనల్ మీరు మధ్యలోకి రాకండి అని మను అనగా.. ఇది అందరికీ తెలుసు, అప్పుడు ఇదెలా పర్సనల్ అవుతుందంటూ చెప్పుకొస్తుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











