Guppedantha Manasu May 27th: తండ్రిని కనిపెట్టమంటూ మను వేదన.. మాటిచ్చిన మహేంద్ర.. షాక్‌లో వసు, అనుపమ!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మను వద్దకు వసు వస్తుంది. తాను తండ్రి లేకుండా ఎదుర్కున్న సమస్యల గురించి చెబుతాడు. మోయనలేనంత వేదన, బాధ ఉన్నా నిలబడ్డానని.. తన తండ్రి గురించి తెలుసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేశానని వివరిస్తాడు. తల్లి కూడా తండ్రి గురించి చెప్పకుండా దూరం పెట్టిందని.. త్వరలోనే తండ్రి గురించి తెలుసుకుంటానంటూ చెప్పుకొస్తాడు. దత్తత కార్యక్రమం ముందురోజు నాకు ఫోన్ చేసి నా తండ్రి గురించి తెలిసే అవకాశం ఉందన్నారని అడిగాడు. నేను దత్తతకు ఒప్పుకోవడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయని.. ఒకటి అనుపమ మేడమ్ కు ఇష్టం అని, రెండోది నా తండ్రి గురించి దత్తత తర్వాత తెలుస్తుందని మీరు చెప్పడం వల్లే అంటూ వసుకు వివరిస్తాడు. అలాగే తన తల్లికి తన బాధ అయ్యేలా చెప్పారా అని.. తన తండ్రి ఎవరో చెప్పిందా అని అంటాడు.
పోనీ మీకైనా చెప్పిందా నా తండ్రి ఎవరు, ఏంటి అనేది మీకైనా తెలుసా అంటూ అడుగుతాడు. మీకు సమాధానం తెలిస్తే చెప్పండి మేడమ్ ప్లీజ్ అంటూ వివరిస్తాడు. ఆ ప్రశ్న మోయలేకపోతున్నానని.. ఆ సమాధానం కోసమే ప్రతీ నిమిషం వెతుకులాడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇదంతా వింటున్న వసు కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా తండ్రి ఎవరో మీకు తెలుసా, లేదా అంటే చప్పుడు చేయదు. మీరు మౌనంగా ఉన్నారంటే మీక్కూడా సమాధానం తెలుసు అని అంటాడు. ఎవరో చెప్పండి అంటూ బతిమాలుతాడు. కానీ వసు మాత్రం అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. మీకు నా తండ్రి ఎవరో తెలుసు, కానీ ఎవరి కోసం దాచిపెడుతున్నారో తెలుసుకోవాలి అంటూ మనసులో అనుకుంటాడు. ఇక ఇంటికి వచ్చాకా కూడా అదే ఆలోచిస్తూ ఉండగా.. అనుపమ పెద్దమ్మ జ్యూస్ తీసుకుని వస్తుంది. తాగమంటే తాగనంటాడు.

ఎందుకు నాకే ఇలా జరుగుతుంద, నా జీవితమే ఇలా ఎందుకు నాశనం అవుతుందంటూ ఫైర్ అవుతాడు. నాలా పరిష్కారం దొరకని సమస్య ఎవరికీ ఉండదంటూ.. ఇన్నాళ్లూ తన తండ్రి గురించి తనకు తెలియకపోవడం దారుణం అంటూ ఫీల్ అవుతాడు. అందరికీ తెలిసినా నాకే తెలియదంటూ ఫైర్ అవుతాడు. ఎవరికి తెలుసంటూ అనుపమ పెద్దమ్మ అనగా.. వసుకు తెలుసంటాడు. ఆమెకు తెలుసని నీకెలా తెలిసిందని అంటుంది. ఈరోజు అదే విషయం అడిగితే ఆమె సైలెంట్ గా ఉందని... దీని ద్వారానే ఆమెకు తెలుసని కన్ఫార్మ్ చేసుకున్నానంటూ వివరిస్తాడు. తెలియదు అని కూడా చెప్పలేదు కదా అనగా.. ఆమెకు తెలిస్తే తెలుసని చెప్పేది కదా అంటూ అనుపమ పెద్దమ్మ వివరిస్తుంది. చూస్తూ ఉండలేని దానివి నువ్వైనా చెప్పొచ్చు కదా అంటాడు. నా తండ్రి ఎవరో చెప్పి నా బాధను పోగొట్టొచ్చు కదా అంటాడు.

నీ తండ్రి ఎవరో నేను చెప్పలేను.. నువ్వు అడగకూడదనే ఒప్పందం మన మధ్య ఉంది కదా అంటుంది. దీనికి మను చాలా ఫీల్ అవుతాడు. నాకు తండ్రి ఎవరో తెలిసే క్షణాలు చాలా దగ్గరలోనే ఉన్నాయని నాకు తెలుస్తుందంటూ వివరిస్తాడు. అప్పటి వరకు నా ప్రయత్నం నేను చూస్తూనే ఉంటానని అంటాడు. మహేంద్ర తండ్రిగా చూస్తున్నాడుగా, ఆయన దత్తత తీసుకుంటాడుగా అంటుంది. ఆయనను నీ తండ్రిగా అంగీకరించు అనగా.. వేరే వాళ్లను ఎలా తండ్రిగా ఎలా అంగీకరిస్తానంటూ వివరిస్తాడు. మహేంద్రగారిని గుర్తు చేసి నా తండ్రిని కనుక్కోవడానికి మంచి ప్లాన్ వచ్చేలా చేశావు అంటూ మను అంటాడు. చెప్పను చూడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర, వసు, అనుపమలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కావాలనే మనును.. శైలేంద్ర రెచ్చగొట్టాడని, మాటిమాటికి ఆయన తండ్రి ప్రస్తావన తీసుకు వస్తూ.. ఇబ్బంది పెడుతున్నాడంటూ చెప్పుకొస్తుంది.

శైలేంద్ర అంటున్న ప్రతీ మాట మను గుండెల్లో గుచ్చుకుంటోందని.. తండ్రి పక్కనే ఉన్నా తెలుసుకోలేని అభాగ్యుడు అని వసు అంటుంది. అదేంటి వసుధార మను తండ్రి ఎవరంటూ మహేంద్ర అనగానే.. వసు అలా కాదు మామయ్యా.. తండ్రి లాంటి మీరు పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోతున్నారని అంటున్నానని కవర్ చేస్తుంది. అప్పుడే మను ఎంట్రీ ఇస్తాడు. మీరు నన్ను కొడుకులా భావిస్తున్నానని చెప్పారు కదా.. మీ కొడుక్కు తొడగాల్సిన కంకణం కూడా నాకు తొడిగారు కదా... నా తండ్రి మీరేనంటూ అందరి ముందు చెప్పి నా సమస్యలు తీర్చారు కదా.. ఇప్పుడు ఇంకో సాయం చేయండి అంటూ వేడుకుంటాడు. ఏంటో చెప్పు మను అని మహేంద్ర అనగా.. నా నిజమైన తండ్రి ఎవరో మీరే కనిపెట్టాలి అంటాడు. అప్పుడే వసు, అనుపమలు షాక్ అవుతారు. మీ నా తండ్రి కావడం అనేది తాత్కాలికమే, నా నిజమైన బాధను పోగొట్టాలంటే నా తండ్రి ఎవరో తెలియాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

అప్పుడే అనుపమ.. ఏంటి మను అలా అంటావు.. మహేంద్ర కనుక్కోవడం ఏంటని అనుపమ అంటుంది. నీరు ఎలాగూ చెప్పరు కదా నేనే కనుక్కుంటున్నాను అంటూ చెప్పుకస్తాడు. మన అనే మనుషులు మూడు రకాలు అని.. మన కోసం కన్నీళ్లు పెట్టేవాళ్లు, కన్నీళ్లు తుడిచే వాళ్లు, కన్నీళ్లే రాకుండా చూసేవాళ్లు అంటూ అంటాడు. నాకు కన్నీళ్లే రాకుండా చూసేవాళ్లలో మహేంద్ర సార్ ఉంటారని.. అందుకే ఈ సాయం చేయమంటున్నానని వివరిస్తాడు. నా నిజమైన తండ్రి ఎవరో కనిపెట్టి మీరే నా ముందుకు తీసుకు రావాలంటూ అడుగుతాడు. ఇందుకు మహేంద్ర కూడా సరేనంటాడు. మాటివ్వమని మను చేయి చాచగా.. వసు, అనుపమలు తెగ టెన్షన్ పడిపోతారు. కానీ మహేంద్ర మాత్రం మాటిస్తాడు. ఇలా సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











