Hyper Aadi: సిగ్గు ఉంటే మూసుకొని వేళ్ళు.. హైపర్ ఆది పరువు పోయేలా పూర్ణ సీరియస్

హైపర్ ఆది ఎలాంటి షో చేసినా కూడా హైలెట్ అయ్యే విధంగా పంచ్ లు వేస్తూ ఉంటాడు. ఇక అతను అప్పుడప్పుడు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్ని సార్లు సీరియస్ గా షో జడ్జెస్ పై పంచ్ లు వేస్తూ హైలెట్ అవుతుంటాడు. ఇక ఈసారి ఢీ 14లో హైపర్ ఆది చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా ఆది పూర్ణ జడ్జిమెంట్ పై పంచ్ లు వేయగా అందుకు ఆమె కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాప్ డ్యాన్స్ షోగా

టాప్ డ్యాన్స్ షోగా

టాప్ డ్యాన్స్ షోగా రేటింగ్స్ అందుకుంటున్న ఢీ గడిచిన 13 సీజన్స్ కూడా ఎంతో ఆసక్తిగా కొనసాగాయి. అయితే ఈ 14వ సీజన్ కూడా ఎంతో హైప్ తో ముందుకు కొనసాగుతోంది. అయితే డాన్సర్స్ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ 14వ సీజన్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉండగా స్పెషల్ టీం లీడర్స్ గా మరికొందరు కమెడియన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

హైపర్ ఆది హైలెట్

హైపర్ ఆది హైలెట్

ఇక ఎంతోకాలంగా హైపర్ ఆది కూడా ఈ డ్యాన్స్ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిపై తనదైన శైలిలో పంచులు వేసే హైపర్ ఆది జడ్జ్ లపై కూడా కామెంట్ చేస్తూ అప్పుడప్పుడు రొమాంటిక్ గా స్టెప్పులు కూడా వేస్తూ ఉంటాడు. ఇక జడ్జిగా కొనసాగుతున్న యాంకర్ పూర్ణ తో హైపర్ ఆదికి కొంత కోల్డ్ వారు నడిచినట్లుగా హైలెట్ చేశారు. ఈ సీజన్లో పూర్ణ తో పాటు గణేష్ మాస్టర్, అని మాస్టర్ న్యాయనిర్ణేతలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

శ్వేతా, ఆది డ్యాన్స్ పోటీ

శ్వేతా, ఆది డ్యాన్స్ పోటీ

ఇక ప్రోమోలో హైపర్ ఆది కూడా చాలా హైలెట్ గా నిలిచాడు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రోమోలో హైపర్ ఆది శ్వేతకు మధ్యలో కొంత డ్యాన్స్ పోటీ జరిగింది. ఇక శ్వేతా చాలా స్టైలిష్ గా స్టెప్పులతో ఆకట్టుకోగా హైపర్ ఆది కామెడీగా డిఫరెంట్ స్టెప్పు వేసే ప్రయత్నం చేశాడు.

 జడ్జిమెంట్ నచ్చలేదు అని

జడ్జిమెంట్ నచ్చలేదు అని

అయితే ఆ పోటీ గురించి జడ్జెస్ నిర్ణయం తీసుకోగా మొదట అందరూ కూడా శ్వేతా డాన్స్ అద్భుతం అని చెప్పారు. ఇక పూర్ణ కూడా అదే తరహాలో చెప్పడంతో హైపర్ ఆది ఊహించని విధంగా ఫస్ట్ టైం నాకు మీ జడ్జిమెంట్ నచ్చలేదు అని సెటైర్ వేశాడు. దీంతో పూర్ణ నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు అని కూడా చెప్పింది. అంతటితో ఆగకుండా ఆది.. నాకు డాన్స్ రాదు అంటూ చిరాకుతో చెప్పినట్లుగా బిహేవ్ చేసాడు.

 సిగ్గు ఉంటే వెళ్ళు.

సిగ్గు ఉంటే వెళ్ళు.


ఇక తర్వాత వెంటనే పూర్ణ.. సిగ్గు ఉంటే వెళ్ళు సిగ్గు లేదంటే ఉండు.. లేకపోతే నోరు మూసుకొని వెళ్లి కూర్చొ అని కాస్త సీరియస్ గా చెబుతున్నట్లు కామెంట్ చేయడంతో.. అందుకు ఆది తనకు నోరు కూడా లేదు అంటే మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక వీరి మధ్య సంభాషణ ఈ ఎపిసోడ్లో హైలెట్ గా నిలిచినట్లు అనిపిస్తోంది. మిగతా జడ్జిలు కూడా చాలా నవ్వుకున్నారు. మరి పూర్తి ఎపిసోడ్లో హైపర్ ఆది ఇంకా ఎలాంటి పంచులు వేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X