నన్ను మోసం చేశాడు.. ఏడుపు కూడా రావట్లేదు.. చైతన్య మాస్టర్ తల్లి షాకింగ్ కామెంట్స్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడం తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేపింది. అప్పుల బాధలు తట్టుకోలేకే చనిపోతున్నానంటూ సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పడంతో అంతా విస్తుపోయారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలియజేశారు.
అయితే చైతన్య అప్పుల పాలు అయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. ఆత్మహత్య చేసుకునేంత అప్పులు చేసే అవకాశం లేదని, ఒకవేళ అప్పులు చేసిన అవి తీర్చెంతా ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు.

తారల స్పందన: ఢీ 15 చాంపియన్ బ్యాటిల్ షిప్ డ్యాన్స్ రియాలిటీ షోలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆదివారం అంటే ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెరపై సంచలనంగా మారింది. ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించిన తర్వాత నెల్లూరులోని హోటల్ లో చైతన్య ఆత్మహత్య చేసుకోడంపై పలువురు అనుమానిస్తున్నారు. ఇక ఆయన సూసైడ్ పై పలువురు బుల్లితెర తారలు పలు విధాలుగా స్పందించారు.

పేమెంట్ మాత్రం: మాస్టర్ చైతన్య అన్నయ్య ఒక ప్రోగ్రామ్ పేమేంట్ రాకపోవడంతోనే చనిపోయి ఉండుంటాడని కండక్టర్ ఝాన్సీ తెలిపింది. ప్రోగ్రామ్ నిర్వాహకులు తమకు ఏదైనా లాస్ అయితే తర్వాత పర్ఫామెన్స్ ఇచ్చేవారిని పిలవకండి కానీ, పేమెంట్ మాత్రం ఆపకండి అని రిక్వెస్ట్ కూడా చేసింది. ఇక యాంకర్ రష్మీ, శేఖర్ మాస్టర్ ఆత్మహత్య పరిష్కారం కాదని తమ ఆవేదనను తెలియజేశారు.

అది అబద్దం: ఇక కన్నకొడుకు భౌతిక దేహం చూసి కన్నీరుమున్నీరు అయింది చైతన్య తల్లి లక్ష్మీ రాజం. అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అని ఆమె అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు తనతో మాట్లాడిన విషయాలను చెప్పుకొచ్చారు లక్ష్మీ రాజం.

పరిచయాలు పెంచుకో: "ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్ గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకోమని చెప్పా. సరే అన్నాడు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు" అని చైతన్య తల్లి లక్ష్మీ రాజం తెలిపారు.

నేను కూడా వెళ్లేదాన్ని కదా: "అంతకుముందు గుడికి వెళ్లాలి ఇంటికా రా అంటే. నాక్కూడా చిరాకుగా ఉందమ్మా. గుడికి వెళ్దాం. ప్లాన్ చేయ్ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా అంట్.. నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా. నీ పక్కన నాక్కూడా బెర్త్ కన్ఫమ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా" అని లక్ష్మీ రాజం కన్నీళ్లు పెట్టుకుంది.
అదే నాకు నచ్చట్లేదు: డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బుల వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వనా. తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్ కు కూడా చెప్పకపోవడం బాధేస్తుంది అని లక్ష్మీ రాజం తెలిపారు.

ద్రోహం చేశాడనే బాధ: "నన్ను మోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి నాకు ఏడుపు కూడా రావట్లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది. అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది" అని చైతన్య తల్లి లక్ష్మీ రాజం ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











