Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి నైనిక.. అప్పుడు అతడితో లవ్.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
ఎవరూ ఊహించని సంఘటనలతో చూపించడంతో పాటు ఉత్కంఠను రేపే టాస్కులను పెడుతూ తెలుగు ప్రేక్షకులను మైమరపిస్తోన్న ఏకైక షోనే బిగ్ బాస్. దేశంలో ఎన్నో భాషల్లో వస్తున్నా ఇక్కడ మాత్రమే భారీ రేటింగ్‌ను అందుకుంటోన్న ఇది.. వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టారు. ఎంతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ సీజన్‌లోకి నైనిక అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? గతంలో ఆమె ఎక్కడ కనిపించింది? అనే వివరాలను మీరు కూడా చూసేయండి మరి!
గ్రాండ్‌గా ఎనిమిదో సీజన్
బిగ్ బాస్ సీజన్ తెలుగులో ఎప్పుడు వచ్చినా దానిని అదిరిపోయే స్పందన వస్తుంది. అందుకే ఎనిమిదో సీజన్‌ను తాజాగా ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి తెగ సందడి చేస్తున్నారు.

అంతులేని వినోదంతోనే
తెలుగులోకి బిగ్ బాస్ షో ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయమైంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మద్దతుతో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా చాలా సీజన్లను పూర్తి చేసుకుని.. ఎనిమిదో దానిని కూడా నేటి నుంచి మొదలు పెట్టారు. అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో ఇది ప్రసారం కాబోతుంది. దీనికి తగ్గట్లే హౌస్ కూడా అల్టిమేట్‌గా కనిపిస్తోంది.
హౌస్‌లోకి నైనిక ఎంటర్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి జరుగుతున్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులోకి ఢీ ఫేం నైనిక అనే అమ్మాయి కూడా అడుగు పెట్టాడు. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిన ఆమె ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో నైనిక ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేసిందని చెప్పుకోవాలి.
ఇంతకీ ఎవరీ ఢీ నైనిక?
నైనిక బిగ్ బాస్ షోలోకి రాకముందే చాలా మందికి బుల్లితెరపై కనిపించింది. ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'ఢీ' షోలో ఒక సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సమయంలోనే సాయి అనే డ్యాన్సర్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ కనిపించింది. అలా ఈ అమ్మడు చాలా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంది.
తక్కువ రెమ్యూనరేషన్
బిగ్ బాస్ షోలో సెలెబ్రిటీల డిమాండ్‌ను బట్టి వాళ్లకు వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ఢీ నైనికకు కాస్త తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే, తన కెరీర్‌కు ఈ షో ప్లస్ అవుతుందని భావించిన ఈ చిన్నది.. ఇందులోకి వచ్చేందుకు వెంటనే ఓకే చెప్పేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి నైనికకు ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











