టీవీలో నాగబాబు కుమార్తె నిహారిక యాంకరింగ్
హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈటీవీలో ఓ పోగ్రాంకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సందడి చేయనుంది. ఆ పోగ్రాం మరేదో కాదు...'ఢీ'-7 . చిన్నారులు 'ఢీ' కొట్టబోతున్న ఈ పోగ్రాం ఈ బుధవారం నుంచి రాత్రి 9.30 గంటలకు 'ఈటీవీ'లో ప్రసారం అవుతుంది.

డ్యాన్స్ ఆధారిత కార్యక్రమంలో బాగా పాపులరైంది 'ఢీ'. 'ఈటీవీ'లో విజయవంతంగా ప్రసారమవుతోందీ కార్యక్రమం. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న చాలా మంది డ్యాన్స్ మాస్టర్లు, డ్యాన్సర్లు ఈ కార్యక్రమం ద్వారా వచ్చినవాళ్లే. ఇప్పటికే ఆరు సిరీస్‌లను నిర్వహించారు. ఏడో సిరీస్ బుధవారం నుంచి ప్రసారం కాబోతోంది.
ఈసారి 'ఢీ' కార్యక్రమంలో చాలా మార్పులు చేశారు. ఇందులో 12 మంది చిన్నారులు పోటీ పడతారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఇద్దరు బృంద నాయకుల్ని ఏర్పాటు చేశారు. బృంద నాయకులుగా లాస్య, రవి ఉంటారు. పోటీదారుల్ని ఎంపిక చేసుకునేందుకు విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌లో ఆడిషన్స్ నిర్వహించారు. అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మందిని ఎంచుకున్నారు.

రాష్ట్రం నుంచే కాక బెంగళూరు, ముంబయి వంటి ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. న్యాయ నిర్ణేతలుగా తరుణ్ మాస్టర్, శేఖర్ మాస్టర్, నటి సదా ఉంటారు. వ్యాఖ్యాతగా ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వ్యవహరిస్తారు.
'ఢీ'-7 ఈ బుధవారం నుంచి రాత్రి 9.30 గంటలకు 'ఈటీవీ'లో ప్రసారం అవుతుంది.


Click it and Unblock the Notifications











