Dhee: విషాదం.. ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య.. తక్కువ డబ్బు ఇస్తున్నారంటూ వీడియో!
బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో ఢీ ఒకటి. 2009లో ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షో వరుసగా సీజన్ల మీద సీజన్ల చేసుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా ఎంతో మంది టాలెంటెడ్ డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్లకి సినీ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఢీ షో 15వ సీజన్ నడుస్తోంది. ఢీ 15 ఛాంపియన్స్ బ్యాటిల్ షిప్ పేరుతో సరికొత్తగా డ్యాన్స్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ షోలోని ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు అలుముకుంటున్నాయి. కొందరు వయోభారం, ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. తాజాగా టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరోయోగ్రాఫర్ గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడే చేసుకున్నారు. దానికంటే ముందుగా సూసైడ్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

డ్యాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని సమాచారం. సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటీ డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పారు. అప్పులు ఇచ్చిన వాళ్ల ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని, చాలా ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదని ఈ వీడియోలో చైతన్య తెలిపారు.

ఒక అప్పును పూడ్చుకునేందుకు మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని డ్యాన్స మాస్టర్ చైతన్య వెల్లడించారు. నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. అయితే ఢీ పోగ్రామ్ లో పేరు వచ్చింది కానీ, సంపాదన తక్కువగా ఇస్తున్నారని, జబర్దస్త్ లో ఎక్కువగా ఇస్తున్నారని ఆ సెల్ఫీ వీడియోలో చైతన్య చెప్పుకొచ్చాడు. కాగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు సమాచారం. అనంతరం చైతన్య డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











