Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నానిని ఇలా వాడేశారు.. న్యాచురల్ స్టార్ జీవితం మొత్తాన్ని అలా చూపించేశారు!
బుల్లితెరపై వినోదాన్ని అందించే కార్యక్రమాలెన్నో ఉన్నాయి. పాటలు, డ్యాన్సులు, కామెడీ వంటి స్పెషల్ షోలు.. ఈ మూడింటిని కలిపి ఉండే షోలు కూడా ఉంటాయి. అలా డ్యాన్స్ అంటే మాత్రం ఇప్పుడు అందరికీ ఢీ షోనే గుర్తుకు వస్తుంటుంది. అయితే ఈ మధ్య ఆ షోలో డ్యాన్సులు తక్కువయ్యాయ్.. కామెడీ స్కిట్స్ ఎక్కువయ్యాయని విమర్శలు వస్తుంటాయి. వచ్చే వారం ఢీ యూనిట్ మొత్తం కూడా నానికి స్పెషల్ ట్రిట్యూబ్ ఇచ్చేస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది.
నాని అలా..
నాని మొదటగా ఆర్జేగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సినీ రంగం మీదున్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు కావాలన్న కోరికతో టాలీవుడ్లోకి వచ్చాడు. అసిస్టెంట్ దర్శకుడిగా ట్రై చేద్దామని చూశాడు. అలా క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు. రాధాగోపాలం సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా పని చేశాడు.
మెల్లిగా అవకాశాలు..
క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ న్యాచురల్ స్టార్ రేంజ్‌కు నాని ఎదిగేశాడు. అలా నానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ మార్కెట్ ఏర్పడింది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగేశాడు నాని.
బర్త్ డే స్పెషల్..
అలా నాని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. అందుకే నాని బర్త్ డే (ఫిబ్రవరి 24)ను ఢీ టీం సెలెబ్రేట్ చేయబోతోంది. ఈ మేరకు నాని జీవితాన్ని పాటల రూపంలో, నాని పాటలను పర్ఫామెన్స్ చేస్తూ ట్రిట్యూబ్ ఇచ్చేసింది. నాని మాట్లాడిన మాటలను కూడా వాడేసుకున్నారు.
ప్రదీప్ అలా..
మిడిల్ క్లాస్ అబ్బాయిలు సినిమా ఈవెంట్లో నాని మాట్లాడిన మాటలను కూడా ఢీ షోలో వాడేశారు. నాని హీరోగా అవ్వడంతో మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలకు కూడా ఎంతో ధైర్యమొచ్చిందంటూ నానిని ఆకాశానికెత్తేశారు. మొత్తానికి నాని పాటలకు ఢీ కంటెస్టెంట్లు వేసిన స్టెప్పులు బాగానే క్లిక్ అవుతున్నాయి.
బిజిబిజీగా..
నాని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికప్పుడు టక్ జగదీశ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆ తరువాత శ్యామ్ సింఘరాయ్.. ఆపై అంటే సుందరానికీ అనే సినిమాను పూర్తి చేయనున్నాడు. అలా వరుసగా ప్రాజెక్ట్‌లతో నాని క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.