For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రమాదంలో ఢీ షో కంటెస్టెంట్లు: ఆందోళలనలో జడ్జ్‌లు.. బాబా మాస్టర్ వార్నింగ్.. రోజా ఫైర్!

  |

  తెలుగులోనే కాదు.. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకుంది 'ఢీ'. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదకొండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఛాంపియన్స్ అందరితో ఓ సీజన్ చేస్తోంది. ఇది కూడా ఫినాలేకు చేరుకుంది. ఇలాంటి సమయంలో ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు ఊహించని ప్రమాదం ఎదురైంది. దీంతో జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, పూర్ణ ఆందోళన చెందుతున్నారు. దీనిపై బాబా భాస్కర్ మాస్టర్ వీడియో సందేశం పంపారు. అలాగే, జబర్ధస్త్ జడ్జ్ రోజా కూడా ఫైర్ అయ్యారు. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే...

  మాస్టర్లు అంతా అలా ఫేమస్ అయ్యారు

  మాస్టర్లు అంతా అలా ఫేమస్ అయ్యారు

  దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాది నుంచి వచ్చే కంటెస్టెంట్లతో నడుస్తోంది ఢీ డ్యాన్స్ షో. అందుకే దీనికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంతటి పేరున్న ఈ షో వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో శేఖర్ మాస్టర్, గణేష్ స్వామి మాస్టర్, జానీ మాస్టర్, యశ్ మాస్టర్ సహా ఎంతో మంది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

  ఢీ షోలో జబర్ధస్త్ కమెడియన్ల హల్‌చల్

  ఢీ షోలో జబర్ధస్త్ కమెడియన్ల హల్‌చల్

  ఢీ షో అంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం వెనుక దానికి స్క్రిప్టు రాస్తున్న జబర్ధస్త్ కమెడియన్ల పాత్ర కూడా ఉంది. అలాగే, రెండు మూడు సీజన్లుగా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, వర్షిణి, హైపర్ ఆది వంటి వాళ్లు కామెడీతో కొత్త వన్నె తీసుకొస్తున్నారు. అలాగే, యాంకర్ ప్రదీప్ కూడా అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. వీరితో పాటు జడ్జ్‌లు కూడా తమ మార్క్ చూపిస్తున్నారు.

  అతిపెద్ద ప్రమాదంలో ఢీ షో కంటెస్టెంట్లు

  అతిపెద్ద ప్రమాదంలో ఢీ షో కంటెస్టెంట్లు

  ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ ఫినాలే ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. తుది పోరులో చిట్టి మాస్టర్ కంటెస్టెంట్ సోమేష్.. యశ్ మాస్టర్ కంటెస్టెంట్ పియూష్ పోటీ పడుతున్నారు. మరో వారంలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇలాంటి సమయంలో ఆ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లలో కొందరు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటనతో బుల్లితెరపై కలకలం రేగుతోంది.

  జబర్ధస్త్ కమెడియన్ల వల్లే ఇలా జరిగింది

  జబర్ధస్త్ కమెడియన్ల వల్లే ఇలా జరిగింది

  ఇంతకీ ఢీ కంటెస్టెంట్లను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు.. నెంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్‌కు చెందిన కమెడియన్లు. అవును... నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈటీవీ ప్రతి ఏడాది ఒక ప్రత్యేక ఈవెంట్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ‘DJ 2021 New Year Special Event' పేరిట రానున్న కార్యక్రమంలోనే ఇలా జరగడం గమనార్హం.

  బాబా మాస్టర్ వార్నింగ్.. రోజా ఆగ్రహం!

  బాబా మాస్టర్ వార్నింగ్.. రోజా ఆగ్రహం!

  తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందులో తమ డ్యాన్సర్లను జబర్ధస్త్ కమెడియన్లు కిడ్నాప్ చేయడంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఫైర్ అయ్యారు. ఆయన ఏకంగా పెద్ద కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. జబర్ధస్త్ కార్యక్రమం కొనసాగుతోన్న సమయంలో ప్రసారం చేసిన వీడియోలో ఆయన వాళ్లందరికీ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి రోజా కూడా ధీటుగానే స్పందించారు.

  #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
  అసలేం జరిగింది.? జరగబోతుందంటే

  అసలేం జరిగింది.? జరగబోతుందంటే

  ఢీ షో జరుగుతున్న సమయంలో జబర్ధస్త్‌కు చెందిన అభి, రాఘవ, తాగుబోతు రమేష్ వచ్చి న్యూ ఇయర్ ఈవెంట్ కోసం స్టేజ్ కావాలని కోరుతారు. దానికి వాళ్లు ఒప్పుకోకపోవడంతో డ్యాన్సర్లను కిడ్నాప్ చేస్తారు. దీనికి అంతే ధీటుగా స్పందించింది ఢీ యూనిట్. దీంతో రెండు షోల మధ్య పోటీ పెడదామని డిసైడ్ అవుతారు. ఈ థీమ్‌తోనే స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది.

  English summary
  Dhee is an Indian dance reality show telecasting in ETV. The show is produced by Mallemalla Productions and is often referred to as South India's biggest dance show. First season of the show was presented by Prabhu Deva. Rambha was the judge of the show in Season 4.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X