నరకం చూస్తున్నా.. ఓపిక నశించింది.. ఇక ఆత్మహత్యే.. రెండో పెళ్లి వార్తలపై భోరుమన్న జాను లిరీ (వీడియో)

జానపద నృత్యకారిణి జాను లిరీ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపుతున్నది. తనను మానసికంగా వేధిస్తున్న వారిని ఉద్దేశించి ఆవేదన కూడిన బాధను ఆమె ప్రపంచానికి చెప్పుకొనే ప్రయత్నం చేసింది. భోరున ఏడుస్తూ తన ప్రాణాలను తీస్తే.. తనను అవమానిస్తే.. వేధిస్తే మీకు ఏం వస్తుంది? అంటూ ప్రశ్నించింది. అయితే తన రెండో పెళ్లి గురించి అసత్య ప్రచారాలు చేయడంపై ఆమె ఆవేదన చెందారు. అందుకే ఈ వీడియోను చేశారు అనే విషయం స్పష్టమైంది. జాను లిరీ వీడియో వెనుక కథ విషయానికి వస్తే..

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో పాపులర్ షో ఢీ విజేతగా నిలువడంతో జాను లిరీ పేరు అందరికి తెలిసింది. ఆమె పాటలు, డ్యాన్సులు మరింత ఆకట్టుకోవడంతో కొద్దికాలంలోనే సెలబ్రిటీల జాబితాలో తెలిసిపోయింది. తాజా వీడియోలో ఆమె ఆవేదన వెళ్లగక్కిన ప్రకారం.. తనకు ఓ కొడుకు ఉన్నాడని.. తనకు ఇతరులతో సంబంధాలు అంటగట్టడం బాధగా ఉందంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. జాను లిరీ విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ..

Janu Lyri

నేను ఏ రోజు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నాకు ఓపిక నశించింది. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నా. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. నా లైఫ్ మీద మీకు ఎందుకింత ఇంట్రెస్ట్. మీ లైఫ్ మీద పెట్టుకొండి కదా. ఆ టైమ్ మీ లైఫ్ మీద పెట్టుకొంటే బాగుంటుంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా కొడుకు మంచి చదువులు చదువుకొని పై పొజిషన్‌లో చూడాలని ఉంది. కానీ నాకు అది చూడలేనని అర్ధం అవుతుంది.

ఇలా ఇది మాట్లాడితే.. ఏడిస్తే మీరు ఆపేస్తారని కాదు. ఓపిక నశించింది. నేను ఎప్పుడూ, దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడితే తప్పు.. ఓ తమ్ముడని మాట్లాడితే తప్పు. ఎవ్వడితో పడితే వాడితో లింకులు అంటగడుతున్నారు. నాతో అయితా లేదు అని జాన్ లిరీ వీడియోలో భోరున విలపించారు.

వీడియోల కోసం ఓ అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేస్తారా? అది మంచా? చెడా? అని ఆలోచించరు. ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడుతారు. ఆ అమ్మా, నాన్న నన్ను చిన్పప్పటి నుంచి ఒక్క మాట అనుకుండా పెంచారు. కానీ ఈ రోజు అడ్డమైన వెధవలందరితో నేను మాటలు పడుతున్నాను. నా వీడియోలకు గలీజ్ మాటలు పెడుతున్నారు. మీ అమ్మ వీడియోకు అలాంటి మాటలు పెడుతారా? అని ప్రశ్నించారు.

చాలా మంది నాకు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్లు బాధ అవుతుంది. ఇంత నరకం అనుభవించలేకపోతున్నా. చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతున్నారో అని అనుకొనే దానిని. వీళ్లకు ఏం మాయ రోగం వచ్చిందని అనుకొనే దానిని. కానీ మీరు చేసే రచ్చకే వాళ్లు చనిపోతున్నారు. ఆ బాధలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది ఆ బాధ. బాధపడే వారికే బాధ తెలుస్తుంది. కానీ తప్పు. ఒక జీవితాన్ని, ప్రాణాన్ని తీస్తే.. ఆ తర్వాత మీరు ఏం చేయలేదు అని డ్యాన్సర్ జాను లిరీ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: dhee etv Janu Lyri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X