రెండో పెళ్లికి జాను లిరి గ్రీన్ సిగ్నల్ .. నీ ఏడుపు పెళ్లి కోసమేనా?.. ఆడుకుంటోన్న నెటిజన్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఉన్న ఇబ్బందులు, వివాదాలు చాలవు అన్నట్లు డ్యాన్సర్ జాను లిరి చేసిన హడావుడితో అంతా షాకయ్యారు. తనను మానసికంగా వేధిస్తున్నారని, రెండో పెళ్లి చేసుకున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ బోరుమంది. దీంతో నెటిజన్లు అయ్యో పాపమంటూ సానుభూతి చూపించారు. కట్ చేస్తే అందరికీ పెద్ద షాకిచ్చింది డ్యాన్సర్ జాను లిరి. ఈ వివరాల్లోకి వెళితే..

జాను సక్సెస్ వెనుక శేఖర్ మాస్టర్?
తెలుగులోని ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్సింగ్ షోలో ఎంతోమందిని వెనక్కినెట్టి విజేతగా నిలిచింది జాను లిరి. ఆ ఒక్క షోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈమె.. పాటలు, డ్యాన్సులతో సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేసి సెలబ్రెటీ స్టేటస్ అనుభవిస్తోంది. అయితే శేఖర్ మాస్టర్ వల్లే జానుకి ఈ అదృష్టం దక్కిందని.. ఆమె ఏ స్టెప్ వేసినా బాగా యాంకరేజ్ చేసేవాడని నెటిజన్లు మండిపడుతున్నారు.
పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న జాను లిరి
జానులో పెద్దగా స్కిల్స్ లేవని రెండు మూడు స్టెప్పులను అటు తిప్పి ఇటు తిప్పి కంపోజ్ చేయడంతో పాటు ఏ పాటకైనా ఒకటే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేదని మండిపడ్డారు. ఆమె తన సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా, ఏం పోస్ట్ చేసినా ఇలాంటి కామెంట్సే కనిపించేవి. జాను లిరికి పదో తరగతి చదువుతున్నప్పుడే ఓ అబ్బాయితో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా పుట్టాడు. కానీ మనస్పర్ధల కారణంగా ఈ జంట విడిపోయి.. బాబును పెంచుతూ ఒంటరిగా బతుకుతోంది.
ఆత్మహత్యే శరణ్యం
అయితే ఆమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోందని చెప్పడంతో పాటు ఆమె డ్యాన్స్‌పైనా, శేఖర్ మాస్టర్ పైనా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇది కాస్తా హద్దులు దాటడంతో ఈ ట్రోలింగ్ దెబ్బకి జాను నిన్న ఓ వీడియో విడుదల చేసింది. తన తల్లిదండ్రులే నన్ను ఒక్క మాట కూడా అనరని .. దారినపోయే వాళ్లతో పడాల్సి వస్తోందని బాధపడింది. తనకు కొడుకు ఉన్నాడని.. నేను రెండో పెళ్లి చేసుకున్నానని, అక్రమ సంబంధాలు అంటగట్టడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు.. ఓ అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? నాకు ఇంక చావే శరణ్యమని వాపోయింది జాను.
రెండో పెళ్లికి జాను లిరి గ్రీన్ సిగ్నల్
రెండ్రోజులుగా జాను హడావుడితో మీడియా, సోషల్ మీడియా వేడెక్కింది. కొందరు నెటిజన్లు కూడా ఆమెకు మద్ధతుగా పోస్టులు పెట్టారు. కట్ చేస్తే కొద్దిగంటల్లోనే షాకిచ్చింది జాను లిరి. ఇకపై ట్రోలింగ్ పట్టించుకోనని.. రెండో పెళ్లి చేసుకుంటానని, తర్వాత అందరికీ సమాధానమిస్తానని ఓ వీడియో వదిలింది. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో అంతే సంతోషంగా ఉంటానని.. ట్రోలింగ్ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లనని స్ట్రాంగ్‌గా ఉంటానని చెప్పింది జాను. ఆ కాసేపటికే కాబోయేవాడి ఫోటోను కూడా వదిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నీ నాటకాలు ఇకనైనా ఆపాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు డిప్రెషన్ డ్రామాలాడింది రెండో పెళ్లి కోసమా? అంటూ ఏకీపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











