ఫ్యాన్స్‌కు ఊహించని న్యూస్ చెప్పిన దేత్తడి హారిక: ఏకంగా అతడి మీద కూర్చుని ప్రకటించిన బ్యూటీ
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెట్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి అనే పేరుతో వీడియోలను రూపొందించే ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అందులో రచ్చ చేసిన ఆమె.. మంచి గుర్తింపును అందుకుంది. బయటకు వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హారిక ఏకంగా అతడి మీద కూర్చుని ఊహించని న్యూస్ చెప్పింది. ఆ వివరాలు మీకోసం!

సెన్సేషన్ బ్యూటీ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ
విచిత్రమైన వీడియోలు చేస్తూ దేత్తడి హారిక సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. వీటి వల్ల వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంపికైంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపిస్తూ వచ్చింది. దీంతో ఆరంభంలోనే పేరు దక్కించుకుంది.

కనెక్షన్ కుదిరింది... అతడితో ట్రెండయింది
ఆరంభ ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొందరిని జంటలుగా చేశారు. ఈ ప్రాసెస్‌లో యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిరింది. అయినప్పటికీ షో ఆరంభంలో వీళ్లిద్దరూ పెద్దగా కలవలేదు. కానీ ఆ తర్వాత చాలా క్లోజ్ అయిపోయారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో 'అభిక'గా ట్రెండ్ అయ్యారు.

ఏకైక కంటెస్టెంట్‌గా.. ఫినాలేలో అడుగెట్టింది
మిగిలిన వాళ్లతో పోల్చుకుంటే దేత్తడి హారిక గేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేది. ఫలితంగా టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. తద్వారా రికార్డును క్రియేట్ చేస్తూ ఫినాలేలో అడుగెట్టింది.

బిగ్ బాస్ వల్ల లాభమే... క్రేజ్‌తో పాటు అవి
బిగ్ బాస్ ఫినాలేలో దేత్తడి హారిక మొదట్లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ దాని వల్ల మంచి గుర్తింపుతో పాటు రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకుంది. డబ్బుతో పాటు బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. వీటితో పాటు తన క్రేజ్‌ను అమాంతం రెట్టింపు చేసేసుకుంది.

వివాదంలో హారిక.. మంచిగా తప్పించుకుని
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియమక పత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత దీనిపై విమర్శలు చెలరేగడంతో హారిక మేటర్ వివాదాస్పదం అయిపోయింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది.

ఫ్యాన్స్‌కు ఊహించని న్యూస్ చెప్పిన హారిక
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారికకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని.. దీంతో ఆమె సినిమాల్లోనూ కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ బ్యూటీ ఒక్కటంటే ఒక్క సినిమాను కానీ, వెబ్ సిరీస్‌ను కానీ ప్రకటించలేదు. దీంతో ఆమె పనైపోయిందన్న కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి పూర్తి చేసినట్లు ఊహించని న్యూస్ చెప్పిందీ భామ.

ఏకంగా అతడి మీద కూర్చుని ప్రకటించింది
దేత్తడి హారిక తన కొత్త వెబ్ సిరీస్‌ను తాజాగా ప్రకటించింది. 'ఏవండోయ్ ఓనర్ గారు' అనే టైటిల్‌తో రాబోతున్న దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూట్ పూర్తయిందని తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో హారిక హీరో పైన కూర్చుని ఉంది. దీంతో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











