హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దేత్తడి హారిక: అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే అవాక్కవుతారు!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎంతో మంది అమ్మాయిలు పాపులర్ అయ్యారు. తద్వారా బుల్లితెరపైనో, వెండితెరపైనో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఒకరు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ గుర్తింపును తెచ్చుకున్న హారిక.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును, భారీ ఫాలోయింగ్‌ను అందుకుంది. ఇక, బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత ఆమె క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే దేత్తడి హారిక తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

‘దేత్తడి’తో హారికకు పాపులారిటీ
సొసైటీలో జరిగే ఎన్నో విషయాలపై వినూత్నంగా వీడియోలు చేస్తూ అలేఖ్య హారిక తన కెరీర్‌ను ఆరంభించింది. 'దేత్తడి' అనే ఛానెల్‌లో వీటిని అప్‌లోడ్ చేసేది. ఇవి వినూత్నంగా ఉండడంతో భారీ స్పందన దక్కేది. దీంతో హారిక ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. విలక్షణమైన నటన ప్రత్యేకమైన శైలితో తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోయింది.

బిగ్ బాస్ ఛాన్స్... అతడితో ట్రాక్
సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్‌తో హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. ఇలా హారిక ఎప్పుడూ అతడితోనే ఉంటూ వార్తల్లో నిలిచింది. ఇదే చివరి వరకూ కొనసాగించింది.

షోలో సత్తా.. మంచి పేరు.. డబ్బు
బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు, బిగ్ బాస్ వల్ల దాదాపు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు ప్రచారం జరిగింది.

వరుస ఛాన్స్‌లతో సత్తా చాటుతూ
బిగ్ బాస్‌లో అద్భుతమైన ఆటతో దేత్తడి హారిక ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఆమె కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకెళ్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోంది. ఈ మధ్య కాలంలో 'వరుడు కావలెను' సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్‌తో అలరించింది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ
అలేఖ్య హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదలుతూ మరింత హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న హారిక
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తుండే దేత్తడి హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను వదులుతూ ఉంటోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంటుంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

హాట్ సెల్ఫీ షేర్ చేసిన బ్యూటీ
బిగ్ బాస్ తర్వాత గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడకుండా ఉంటోన్న దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్ మాత్రమే ధరించి ఉంది. ఫలితంగా ఆమె క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో హారిక వదిలిన ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











