For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhethadi Harika Hot Dance Video: అలాంటి బట్టల్లో ఘాటుగా రెచ్చిపోయిన బ్యూటీ

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుస అవకాశాలను కూడా అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేత్తడి హారిక ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

   దేత్తడి అంటూ ఫేమస్ అయిన హారిక

  దేత్తడి అంటూ ఫేమస్ అయిన హారిక

  అలేఖ్య హారిక ‘దేత్తడి' అనే ఛానెల్‌ను ప్రారంభించి అందరికీ పరిచయం అయింది. అందులో విభిన్నమైన వీడియోలను వదులుతోన్న ఆమె.. విలక్షణమైన నటన ప్రత్యేకమైన శైలితో మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం తన హవాను చూపిస్తూ బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిందామె.

  బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్.. పాపులారిటీ

  బిగ్ బాస్‌లో లవ్ ట్రాక్.. పాపులారిటీ

  సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో దేత్తడి హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. స్టైలిష్ లుక్‌తో అందులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. రావడం రావడమే టాస్కు వల్ల అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడికి దగ్గరవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందంటూ జోరుగా ప్రచారం జరగడంలో పాపులర్ అయింది.

  ఫైటర్‌గా బిరుదు తెచ్చుకున్న బ్యూటీ

  ఫైటర్‌గా బిరుదు తెచ్చుకున్న బ్యూటీ

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించింది. ఇలా ఒకే సీజన్‌లో ఎక్కువ సార్లు ఆ టాస్క్ ఆడిన కంటెస్టెంట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా షోలోనే లేడీ ఫైటర్ అనే బిరుదును అందుకుంది.

   బిగ్ బాస్ వల్ల అన్ని రకాలుగా లాభం

  బిగ్ బాస్ వల్ల అన్ని రకాలుగా లాభం

  అద్భుతమైన ఆటతో ఫినాలే వరకు చేరుకుంది దేత్తడి హారిక. అయితే, చివరి మెట్టుపై బోల్తా పడిన ఆమె.. ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఈ షో వల్ల దాదాపు రూ. 40 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుందని ప్రచారం జరిగింది. డబ్బు మాత్రమే కాదు.. కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకెళ్తోంది.

  వెబ్ సిరీస్‌తో సందడి చేస్తోన్న హారిక

  వెబ్ సిరీస్‌తో సందడి చేస్తోన్న హారిక

  బిగ్ బాస్ పుణ్యమా అని దేత్తడి హారిక క్రేజ్ అమాంతం రెట్టింపు అయింది. అదే సమయంలో ఆమె వరుస వీడియోలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె కొత్త వెబ్ సిరీస్‌ ‘ఏవండోయ్ ఓనర్ గారు'ను ప్రారంభించింది. దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది. దీంతో వరుసగా ఎపిసోడ్లను వదులుతున్నారు.

  ఎప్పుడూ అందులోనే ఉంటూ హైలైట్

  ఎప్పుడూ అందులోనే ఉంటూ హైలైట్

  అలేఖ్య హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదలుతూ హైలైట్ అవుతోంది.

  హాట్ డ్యాన్స్‌తో దేత్తడి హారిక హల్‌చల్

  హాట్ డ్యాన్స్‌తో దేత్తడి హారిక హల్‌చల్

  నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి అప్‌లోడ్ చేస్తూ ఉండే దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా చిన్న బట్టలు వేసుకుని కనిపించింది. దీనికితోడు ఘాటు ఫోజులతో డ్యాన్స్ మూమెంట్స్ చేసింది. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్ అయిపోయింది.

  English summary
  Actress, Bigg Boss Fame Dhethadi Alekhya Harika Vary Active in Social Media. Recently She Shared Hot Dance Video in Her instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X