Dhethadi Harika: హాట్ ఫొటోతో షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ...మార్చి మార్చి చూపించిన బ్యూటీ..!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత దాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకుని.. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో దేత్తడి హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలను చేస్తూ ఎంతగానో ఫేమస్ అయిపోయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ ఆఫర్‌ను అందుకుంది. అందులోకి వెళ్లిన తర్వాత మరింత ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక, బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో హారిక.. హాట్ క్లీవేజ్ షో ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

సింధురా గద్దె.. చాలా రోజులు తరువాత హాట్ స్టిల్స్

 ఛానెల్‌లో ఇంటి పేరుగా మార్చుకుంది

ఛానెల్‌లో ఇంటి పేరుగా మార్చుకుంది

'దేత్తడి' అనే ఛానెల్‌ను ప్రారంభించి.. అందులో నేటి తరం యువతీ యువకులకు సంబంధించిన వీడియోలను చేస్తూ ఫేమస్ అయిపోయింది అలేఖ్య హారిక. ఇలా చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయిన ఈ అమ్మడు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో పలు సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తన సత్తాను నిరూపించుకుంది.

 బిగ్ బాస్ ఆఫర్.. హీరోతో కనెక్షన్‌ వల్ల

బిగ్ బాస్ ఆఫర్.. హీరోతో కనెక్షన్‌ వల్ల

సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిపోయిన దేత్తడి హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే ఆఫర్ వచ్చింది. అలా షోలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఆరంభంలోనే హీరో అభిజీత్‌తో కలిసింది. బిగ్ బాస్ టాస్క్ ప్రకారం.. కనెక్ట్ అయిన వీళ్లిద్దరూ హౌస్‌లో రచ్చ రచ్చ చేశారు. ఫలితంగా వీళ్ల మధ్య ప్రేమాయణం సాగుతుందని అనుకున్నారు. దీంతో హారిక పేరు మారుమ్రోగిపోయింది.

అదరగొట్టేసిన హారిక... రికార్డు క్రియేట్

అదరగొట్టేసిన హారిక... రికార్డు క్రియేట్

అన్ని సీజన్లతో పోలిస్తే నాలుగో దానిలోనే అబ్బాయిలకు సరైన పోటీని ఇచ్చారు అమ్మాయిలు. ఇందులో దేత్తడి హారిక కూడా ఉంది. ఆరంభం నుంచే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ముఖ్యంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికై రికార్డు క్రియేట్ చేసింది. అలా ఫినాలేలోకి సైతం అడుగు పెట్టింది. కానీ, దురదృష్టవశాత్తూ ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దాని ప్రభావంతో మారింది... వరుసగా

దాని ప్రభావంతో మారింది... వరుసగా

బిగ్ బాస్ షోలో హారికకు నిరాశే ఎదురైంది. ఎంతగా ఆడినా గెలవలేకపోయింది. అయితేనేం ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకుంది. ఇక, ఈ షో ద్వారా ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంది. అదే సమయంలో కొన్ని సినిమా ఆఫర్లతో పాటు పలు షోలల పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది. వీటితో పాటు తనుకు ఉన్న ఫాలోయింగ్‌ను అమాంతం రెట్టింపు చేసుకుంది.

 వెబ్ సిరీస్‌తో వచ్చిన హారిక... సక్సెస్‌

వెబ్ సిరీస్‌తో వచ్చిన హారిక... సక్సెస్‌

బిగ్ బాస్ షో తర్వాత దేత్తడి హారిక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి సమయంలో హారిక ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ 'ఏవండోయ్ ఓనర్ గారు'ను ప్రారంభించింది. దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఫేమస్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదలుతూ సందడి చేస్తోంది.

Recommended Video

Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
హాట్ ఫొటోతో షాకిచ్చిన దేత్తడి హారిక

హాట్ ఫొటోతో షాకిచ్చిన దేత్తడి హారిక

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే దేత్తడి హారిక.. తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది. అదే సమయంలో ఘాటుగా చూస్తూ కవ్విస్తోంది. తొలిసారి అలాంటి ఫొటోతో కనిపించడంతో నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు, వీటికి రెండు రకాల ఫిల్టర్లు వాడి మరీ చూపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X