బ్రా ఫొటోతో కనిపించి షాకిచ్చిన దేత్తడి హారిక: తొలిసారి హాట్‌ ఫోజుతో సెగలు రేపిన బిగ్ బాస్ బ్యూటీ

 ఆ వీడియోలతో ఫేమస్.. బిగ్ బాస్ ఆఫర్లు

ఆ వీడియోలతో ఫేమస్.. బిగ్ బాస్ ఆఫర్లు

'దేత్తడి' పేరిట సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అలేఖ హారిక. ఇలా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ అమ్మడికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో భాగంగానే నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ప్రేక్షకుల దృష్టిలో పడింది.

హీరోతో కనెక్షన్... అభికగా ట్రెండ్ అయింది

హీరోతో కనెక్షన్... అభికగా ట్రెండ్ అయింది

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడే నిర్వహకులు కొందరిని జంటలుగా చేశారు. ఈ ప్రాసెస్‌లో యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిరింది. అయినప్పటికీ షో ఆరంభంలో వీళ్లిద్దరూ పెద్దగా కలవలేదు. కానీ ఆ తర్వాత చాలా క్లోజ్ అయిపోయారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో 'అభిక'గా ట్రెండ్ అయిందీ జోడీ.

 బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్... నిరాశతోనే

బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్... నిరాశతోనే

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా ఆటలు ఆడుతూ వచ్చారు. అందులో దేత్తడి హారిక పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా ఆమె ప్రతి టాస్కునూ శ్రమించి ఆడింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడంతో పాటు ఫినాలేకు సైతం చేరుకుంది. అయితే, అందులో ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది.

 భారీ మొత్తంతో పాటు ఆఫర్లు... క్రేజ్ యాడ్

భారీ మొత్తంతో పాటు ఆఫర్లు... క్రేజ్ యాడ్

బిగ్ బాస్ షోలో విజేతగా నిలవకున్నా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది హారిక. అందుకు అనుగుణంగానే క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. దీనితో పాటు రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకుంది. డబ్బుతో పాటు బయటకు వచ్చిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల అనే తేడా లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

 వెబ్ సిరీస్‌ను ప్రకటించిన బిగ్ బాస్ బ్యూటీ

వెబ్ సిరీస్‌ను ప్రకటించిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారికకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని.. దీంతో ఆమె సినిమాల్లోనూ కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తన కొత్త వెబ్ సిరీస్‌ 'ఏవండోయ్ ఓనర్ గారు'ను అనౌన్స్ చేసింది. దీనిని హరీశ్ నాగరాజ్ తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా చేసిన విషయం తెలిసిందే.

 హాట్ ఫోజుతో షాకిచ్చిన హారిక.. ఫొటోతో రచ్చ

హాట్ ఫోజుతో షాకిచ్చిన హారిక.. ఫొటోతో రచ్చ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేత్తడి హారిక.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఓ డోర్ ముందు కూర్చుని హాట్ యోగా చేస్తూ కెమెరాకు ఫోజిచ్చింది. ఇందులో ఆమె బుల్లి నిక్కరుతో పాటు బ్లాక్ స్ట్రిప్ బ్రా వేసుకుని ఉంది. తొలిసారి అలాంటి ఫొటోతో కనిపించడంతో నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడం విశేషం.

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలా మంది తమ టాలెంట్లను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో హారిక అలేఖ్య ఒకరు. దేత్తడి వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈమె.. బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయింది. ఆ షో తర్వాత బిగ్ సెలెబ్రిటీగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా హారిక హాట్ ఫోజుతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Pushpa Action Scenes Visual Treet, సుక్కు మార్క్ ట్విస్ట్ | Allu Arjun || Filmibeat Telugu

వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X