స్టార్ హీరోతో దేత్తడి హారిక మూవీ: ఒకటలా రెండోది ఇలా.. అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న బ్యూటీ

ప్రత్యేకమైన వీడియోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది టాలెంటెడ్ బ్యూటీ అలేఖ్య హారిక. దేత్తడి అనే ఛానెల్ ద్వారా సమాజంలో జరిగే ఎన్నో అంశాలను దృశ్య రూపకంగా చూపిస్తూ పాపుల్ అయిన ఆమె.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల మరింత గుర్తింపును అందుకుంది. ఈ షో తర్వాత వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నా.. దానికి భిన్నంగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో హారిక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిందట. అలాగే మరో దానికి కూడా సంతకం పెట్టేసిందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ ఎంట్రీ... తక్కువ టైమ్‌లోనే గుర్తింపు

బిగ్ బాస్ ఎంట్రీ... తక్కువ టైమ్‌లోనే గుర్తింపు


సోషల్ మీడియాలో దక్కిన క్రేజ్‌తో దేత్తడి హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపిస్తూ వచ్చింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి ఆటతీరు కనబరుస్తూ ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయిందీ బ్యూటీ.

అభిజీత్‌తో లవ్ ట్రాక్.. అదే అనుకుని ట్రెండింగ్

అభిజీత్‌తో లవ్ ట్రాక్.. అదే అనుకుని ట్రెండింగ్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే కొందరిని జంటలుగా చేశారు. అలా కొన్ని క్వాలిటీస్ కలవడం వల్ల యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిరింది. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. అప్పటి నుంచి ట్రాక్ నడుపుతూ 'అభిక'గా ట్రెండ్ అయ్యారు.

బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్‌.. ఫినాలేకు ఎంట్రీ

బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్‌.. ఫినాలేకు ఎంట్రీ

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఉన్న వాళ్లందరితో పోల్చుకుంటే దేత్తడి హారిక గేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేది. తద్వారా టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. తద్వారా రికార్డును క్రియేట్ చేసింది.

భారీగా రెమ్యూనరేషన్... వరుస ఆఫర్లు కూడా

భారీగా రెమ్యూనరేషన్... వరుస ఆఫర్లు కూడా

బిగ్ బాస్ ఫైనల్‌లో నిలిచిన ఐదుగురిలో హారిక ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట. రెమ్యూనరేషన్‌తో పాటు బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

అనవసర వివాదం.. పుల్‌స్టాప్ పెట్టడంతో ఇలా

అనవసర వివాదం.. పుల్‌స్టాప్ పెట్టడంతో ఇలా

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తా ఆమెకు నియమక పత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత దీనిపై విమర్శలు చెలరేగడంతో హారిక మేటర్ వివాదాస్పదం అయిపోయింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది.

అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న దేత్తడి హారిక

అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న దేత్తడి హారిక


బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత దేత్తడి హారిక తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎటువంటి ప్రకటననూ ఇవ్వలేదు. దీంతో ఆమె విషయంలో అనుకున్నదొకటి అయింది మరొకటి అన్నట్లుగా మారింది. దీనికి తోడు అప్పటి లానే వీడియోలు చేసుకుంటోంది. దీంతో ఆమె సినిమా ఛాన్స్‌లపై చర్చ ముగిసింది. ఈ సమయంలో హారిక త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది.

స్టార్ హీరోతో హారిక మూవీ: ఒకటలా రెండోదిలా

స్టార్ హీరోతో హారిక మూవీ: ఒకటలా రెండోదిలా


టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు దేత్తడి హారిక రెడీ అయిందని.. ఇటీవలే దీనికి సంతకం కూడా చేసేసిందని ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. అదే సమయంలో రెండు వెబ్ సిరీస్‌లు కూడా లైన్‌లో పెట్టుకుందని తెలుస్తోంది. అందులో ఒకటి క్రైమ్‌, మరొకటి కామెడీ జోనర్లు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X