దేత్తడి హారిక సంచలన నిర్ణయం: టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకిస్తూ.. వాళ్ల వల్ల బలయ్యే ప్రమాదం ఉండడంతో!

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి హారిక. దీనికి కారణం ఆమెను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించడమే. అంతేకాదు, ఈమె ఎంపిక చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో ఎన్నో మలుపులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ అమ్మాయి గురించి ప్రభుత్వంలో లుకలుకలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకిస్తూ దేత్తడి హారిక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా మొదలైంది.. ఇలా పాపులారిటీ

అలా మొదలైంది.. ఇలా పాపులారిటీ

దేత్తడి అనే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో కెరీర్‌ను ఆరంభించింది అలేఖ్య హారిక. సమాజంలో జరిగే అంశాలను దృశ్య రూపంలో తయారు చేసి వదులుతూ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. తద్వారా సోషల్ మీడియా ఖాతాల్లో ఊహించని రీతిలో ఫాలోవర్లను సంపాదించుకోవడంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది.

అందులోకి ఎంట్రీ... మొత్తం మారింది

అందులోకి ఎంట్రీ... మొత్తం మారింది


సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారడంతో దేత్తడి హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తనదైన శైలి ఆటతో ప్రేక్షకులను గెలుచుకుంది. ప్రతి టాస్కులోనూ రాణిస్తూ ఫైటర్ అనిపించుకుంది. వేరే వ్యవహారాలు ఎలా ఉన్నా.. గేమ్ పరంగా సత్తా చాటింది. తద్వారా ఫినాలేకు చేరింది. ఇక, చివర్లో ఐదో స్థానంలో నిలిచింది.

బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికైన హారిక

బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికైన హారిక


తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తా ఆమెకు నియమక పత్రం కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం హారిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఆమె ఎంపికపై రాజకీయాలు మొదలు

ఆమె ఎంపికపై రాజకీయాలు మొదలు

దేత్తడి హారికను బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపిక చేయడంపై రాజకీయాలు జరుగుతున్నాయి. దీనిపై చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం.. తెలంగాణ నుంచి ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస వంటి వాళ్లను కాకుండా ఈమెను ఎంపిక చేయడమే. దీంతో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.

క్లారిటీ ఇచ్చిన TSTDC చైర్మన్ గుప్తా

క్లారిటీ ఇచ్చిన TSTDC చైర్మన్ గుప్తా

హారికను వెంటనే తొలగించారని ఓ న్యూస్ హల్‌చల్ చేసి నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. 'టూరిజంను ప్రమోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్రచారం చేస్తున్నాం. అందుకే హారికను నియ‌మించాం. ఈ విష‌యంలో మంత్రులు, ఉన్నతాధికారుల‌ను సంప్రదించాం. గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నార‌ు. ఇందులో నిజం లేదు' అంటూ చెప్పారు.

స్పందించిన మంత్రి.. అలా అనడంతో

స్పందించిన మంత్రి.. అలా అనడంతో

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను ఎంపికపై ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 'దేత్తడి హారిక ఎవరో నాకు తెలీదు. ఆమె ఎంపిక గురించి మమ్మల్ని సంప్రదించలేదు' అంటూ కామెంట్స్ చేసినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

దేత్తడి హారిక సంచలన నిర్ణయం.. షాక్

దేత్తడి హారిక సంచలన నిర్ణయం.. షాక్


తాజాగా దేత్తడి హారిక ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. 'అందరికీ నమస్కారం. నేను తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడ‌ర్‌ పోస్టు నుంచి తప్పుకుంటున్నాను. నేనీ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. నన్ను సపోర్ట్ చేసే వాళ్లందరికీ చాలా చాలా థ్యాంక్స్' అంటూ అందులో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X