మళ్ళీ మొదలెట్టిన అలేఖ్య హారిక.. బ్లాక్ టాప్ లో మెరుస్తూ ఆసక్తికర పోస్ట్ !
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన అలేఖ్య హారిక తన చానల్ దేత్తడి ద్వారా దేత్తడి హారికగా పాపులర్ అయింది. యూట్యూబ్ లో ఆమెకు ఉన్న పాపులారిటీతో బిగ్ బాస్ ఫోర్ నిర్వాహకులు ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ బిగ్ బాస్ ద్వారా ఈ భామ మరింత మందికి చేరువ అయింది. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా చేసిన హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఉద్యోగం వదిలేసి మరీ
చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న హారికకు నటన మీద ఆసక్తి పెరగడంతో తాను ఉద్యోగం చేయలేని ఇంట్లో ఒప్పించి ఉద్యోగం మానేసి మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. పూర్తి తెలంగాణ యాసలో పక్కా మాస్ కంటెంట్ తో ప్రేక్షకులకు ఆమె యూట్యూబ్ వీడియోలు అందించేది.. ఆమె స్టైల్ ఆఫ్ వర్క్, తెలంగాణ యాస ప్రజలకు నచ్చడంతో ఆమెను కొద్ది కాలంలోనే యూట్యూబ్ స్టార్ అయిపొయింది.

బిగ్ బాస్ లో సూపర్ క్రేజ్
ఆమె యూట్యూబ్ క్రేజ్ చూసి బిగ్ బాస్ ఫోర్ నిర్వాహకులు ఆమెకు బిగ్బాస్ సీజన్ ఫోర్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఇచ్చారు. ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడ తగ్గకుండా ఆమె మిగతా కంటెస్టెంట్ సీట్లకు పోటీ ఇస్తూ వచ్చారు.
చివరికి ఆమెకు టైటిల్ వస్తుందా అనే అనుమానం కూడా జనానికి కలిగింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఉన్న క్రేజ్ ఎంతో.. అయితే చివరికి ఆ ఫైవ్ వరకే పరిమితమైన ఈ భామ సూపర్ కంటెస్టెంట్ అని మాత్రం అనిపించుకుంది.

ఆచితూచి
అయితే బిగ్ బాస్ ఫోర్ లో వచ్చిన క్రేజ్ తో ఆమె వరుస సినిమాలు చేస్తుందని అందరూ అనుకుంటే చాలా సెలెక్టివ్ గా మంచి పాత్రలు అనుకుంటేనే సినిమాలో ఒప్పుకుంటుంది. ఇప్పటిదాకా ఆమె రెండు సినిమాల్లో నటించింది అందులో ఆదిత్య వర్మ అనే తమిళ సినిమా ఒకటి కాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం సినిమా మరోటి.

సినిమాలు లేపోవడంతో
అయితే సినిమాల్లో అవకాశాలు వెంటవెంటనే రాకపోవడంతో ప్రస్తుతం ఈ భామ ఛానల్ దేత్తడిలో ఇదివరకటిలా వీడియో లు చేయకుండా వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఏవండోయ్ ఓనర్ గారు అంటూ భారీ అంచనాలతో స్టార్ట్ చేసిన ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది..
Recommended Video

హాట్ షో
ఇక ఈ దెబ్బతో ఈ భామ ఇప్పుడు హాట్ షో కి తెరలేపింది. ఎప్పటికప్పుడు పొట్టి బట్టల్లో కనిపిస్తూ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ప్రేక్షకులలో క్రేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఒక హాట్ ఫోటో షేర్ చేసి పేర్కొన్న కామెంట్ మీరే చూడండి.


Click it and Unblock the Notifications











