భార్యకు విడాకులు ఇచ్చాడా? కూతుర్ని వదిలేసి వచ్చాడా? మిస్టరీగా బిగ్‌బాస్ట్ కంటెస్టెంట్ మణికంఠ స్టోరీ
బుల్లితెర ప్రేక్షకులను గడిచిన ఏడు సీజన్లుగా ఎంతగానో అలరిస్తూ వస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ మరోసారి సందడి షురూ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ గ్రాండ్ రియాలిటీ షో మొదలైంది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై అంచనాలను మరింత పెంచారు నిర్వాహకులు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలతో కలిపి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో తుది వరకు ఎవరుంటారో, మధ్యలో ఎవరు వెనుదిరుగుతారో చూడాలి మరి.
బిగ్‌బాస్ షోపై ఎప్పటికప్పుడు అంచనాలను, ఆసక్తికని పెంచడానికి నిర్వాహకులు ప్రోమోస్ రిలీజ్ చేస్తుంటారు. డే 2 ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో నిఖిల్ - నాగమణికంఠకు మధ్య ఏదో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులోనే ఆర్జే శేఖర్ భాషాకు - హీరోయిన్ సోనియా ఆకుల మధ్య ఆరెంజ్‌ల విషయంలో వివాదం రాజుకుంది. ఆరెంజ్‌లను బాల్‌లా ఆడొద్దంటూ సోనియా చాలా సీరియస్ అయ్యింది. ఫలానా వస్తువులే వాడుకోవాలని బిగ్‌బాస్‌లో రూల్ ఏమైనా ఉందా అంటూ ఫైర్ అయ్యాడు.

అనంతరం మణికంఠతో భాషా ముచ్చట పెట్టాడు. ఎలా వదిలి వచ్చావని అడగ్గా.. తప్పదు బ్రదర్, ఇక్కడే ఏదో ఒకటి సాధిస్తానని అంటాడు. నీ వయసెంత అని మణికంఠ అడగ్గా.. 42 అని భాషా చెబుతాడు. తన బిడ్డను వదిలేసి వచ్చానని భాష ఎమోషనల్ అయ్యాడు. తన పాప యూఎస్‌లో ఉందని మణికంఠ చెప్పగా.. వెళ్లొస్తుంటావా అని భాషా అడుగుతాడు. తన భార్య చాలా మంచిదని , కానీ సిచ్యూవేషన్‌ల వల్ల ఇలా జరిగిందని మణికంఠ అన్నాడు. ప్రైజ్‌మనీ పక్కనబెడితే.. బిగ్‌బాస్ ద్వారా నిన్ను ప్రపంచం చూస్తుందని భాషా మోటివేషన్ చేస్తాడు.
ఈసారి కంటెస్టెంట్స్‌లో నాగ మణికంఠ ఫస్ట్ డేనే అందరినీ ఏడిపించేశాడు. తనకు రెండేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడని, తనకు ఊహ తెలిసేసరికి తండ్రిగా ఉన్న వ్యక్తి అసలు తండ్రి కాదని తెలిసి తీసుకోలేకపోయానని చెప్పాడు. తర్వాత కొద్దిరోజులకే క్యాన్సర్‌తో తల్లి మరణించిందని మణికంఠ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు తలకొరివి పెట్టి 11 రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని గుర్తుచేసుకున్నాడు. తోడు కోసం ఒకరిని పెళ్లి చేసుకున్నానని.. తను 9 నెలలకు నా చేతిలో ఆడపిల్లను పెట్టిందని మణికంఠ చెప్పాడు. అయితే మనస్పర్ధలతో భార్య విడాకులు ఇచ్చేయడంతో అమెరికా నుంచి వచ్చేసినట్లు వెల్లడించాడు.
నిన్నటి నుంచి మణికంఠ స్టోరీ విన్నప్పటి నుంచి ప్రేక్షకులకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అయితే ఆయన చెప్పిన విషయాలు నిజం కాదని, అదంతా కట్టుకథని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మణికంఠకు విడాకులేమీ కాలేదని, ఇమ్మిగ్రేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఇండియాకి వచ్చేశాడని అంటున్నారు. అతని భార్యతో మణికంఠకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. అలాగే మణికంఠను ఇంట్లో వాళ్లు వదిలేయలేదని, అతనే పర్సనల్ రీజన్స్‌తో బయటకు వచ్చేశాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











