నాగార్జునను గంగవ్వ బెదిరించిందా? బ్లాక్ మెయిల్ చేసిందా?
బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో గంగవ్వ ఒకరు. పల్లెటూరి యాసలో ఏమాత్రం బెదరకుండా ఆవిడ విసిరే పంచ్‌లు, సామెతలకు బిగ్‌బాస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని భావించిన బిగ్‌బాస్ టీమ్.. వైల్డ్ కార్డ్ ద్వారా కొందరినీ హౌస్‌లోకి పంపించాలని అనుకున్నారు. ఈ క్రమంలో వినిపించిన పేరు గంగవ్వ. మిడ్ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. బాగానే నెట్టుకొచ్చింది. కానీ అనారోగ్య కారణాలతో ఆమె తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమెను అనూహ్యంగా బయటికి పంపించడంపై సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ పదో వారంలో నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈ వారం నాగార్జునతో పర్సనల్‌గా మాట్లాడిన గంగవ్వ.. తన వల్ల కావడం లేదని, ఉండలేకపోతున్నానని చెబుతుంది. దీంతో ఆమె సెల్ఫ్ ఎలిమినేషన్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత రెండ్రోజులకు ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న హరితేజను కూడా ఎలిమినేట్ చేసేశారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మందిలో మెహబూబ్, నయని పావని, గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం రాయల్ క్లాన్‌లో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ , గౌతమ్ ఉన్నారు.

గంగవ్వని అర్ధాంతరంగా ఎలిమినేట్ చేయడం ఆవిడ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఇదే అనుకుంటే కనీసం ఆమెను ఎలిమినేట్ చేసిన తర్వాత కనీసం స్టేజ్ మీదకు కూడా తీసుకురాకపోవడం విమర్శలకు తావిచ్చింది. గతంలో మిడ్‌వీక్‌లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం, అనారోగ్య కారణాలతో తప్పుకున్న నాగ మణికంఠలను కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడనిచ్చారు. కానీ గంగవ్వకు ఆ అవకాశం కూడా ఇవ్వకపోవడం బిగ్‌బాస్ లవర్స్‌ని బాధపెట్టింది.
ఇదిలాఉండగా.. గంగవ్వ తనకు తాను ఎలిమినేట్ అవుతానని అనలేదట, బిగ్‌బాస్ టీమే ఆమెను బలవంతంగా పంపించేశారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పదో వారం వరకు అగ్రిమెంట్ రాయించుకుని, దాని గడువు ముగియడంతో అనారోగ్య కారణాలతో పెద్దావిడను పంపించారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాళ్లు మంటలెక్కిపోవడం, ఆరోగ్యం సరిలేదు అనడం అంతా బిగ్‌బాస్ ప్రీ ప్లాన్డ్ డ్రామా అని అంటున్నారు.

తాజాగా గంగవ్వ ఎలిమినేషన్‌కి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగవ్వను నాగార్జున స్టేజ్ మీదకి ఎందుకు పిలవలేదు, దాని వెనుక రీజన్ ఏంటీ అనే దానిపై కొందరు యూట్యూబర్లు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. తాను ఇక్కడే ఉంటానని, ఇంటికి వెళ్లాలని లేదని బిగ్‌బాస్‌ని, నాగార్జునని రిక్వెస్ట్ చేసిందట. అయితే ఒకదశలో నేను వెళ్లాలంటే నా మనవరాలికి కూడా ఇల్లు కట్టించాలని ఏకంగా నాగార్జుననే బ్లాక్ మెయిల్ చేసిందట.
ఆయన బతిమలాడాలని చూసినా వినిపించకపోవడంతో గంగవ్వను ఎలిమినేట్ చేసి.. స్టేజ్ మీదకి కూడా ఆమెను పిలవొద్దని బిగ్‌బాస్ టీమ్‌కి నాగ్ ఆర్డర్స్ వేశారట. కానీ తనకున్న సమాచారం మేరకు ఇదంతా నిజం కాదని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఖండిస్తున్నారు. మరి బిగ్‌బాస్‌కి గంగవ్వకి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రచారానికి తెరపడదు.


Click it and Unblock the Notifications











