twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందే గర్భం, ఉండటానికి చోటులేదు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కష్టాలు!

    |

    బిగ్ బాస్ షో అంటేనే కాంట్రవర్సీలకు మారు పేరు. తెలుగులో కేవలం 2 సీజన్లకే మనం ఎన్ని కంట్రావర్సీలు చూశామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీలో 12వ సీజన్ రన్ అవుతోంది. మరి ఇందులో కంటెస్టెంట్స్‌ ఇంకెంత కాంట్రవర్సల్‌గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టెలివిజన్ నటి, గతంలో బిగ్‌బాస్ మరాఠీలో పాల్గొన్న మేఘా ధాదే తాజాగా బిగ్‌బాస్ 12లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె ఎంటర్టెన్మెంట్ రంగంలో ఎదగడానికి చాలా కష్టాలు పడింది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు చూసి అంతా షాకవుతున్నారు. అందులో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఒకటి.

     టీనేజీలోనే గర్భం

    టీనేజీలోనే గర్భం

    మేఘా ధాదే టీనేజీ వయసులోనే గర్భం దాల్చింది. అప్పటికీ ఆమెకు ఇంకా వివాహం జరుగలేదు. తర్వాత కొన్ని రోజులకు ఇంట్లోవారు అరేంజ్డ్ మ్యారేజ్ చేశారట. అతడికి అప్పటికే ఒక పెళ్లయింది.

    తండ్రి చనిపోతే బ్లేమ్ చేశారు

    తండ్రి చనిపోతే బ్లేమ్ చేశారు

    నటనను తన కెరీర్‌గా ఎంచుకోవడాన్ని మేఘా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారట. అంతే కాదు తండ్రి చనిపోయినపుడు... ఆమె గర్భం దాల్చడం వల్లనే బాధతో చనిపోయారని ఇంట్లో వారు బ్లేమ్ చేశారట.

    ఆ సమయంలో ఉండటానికి చోటు కూడా లేదు

    ఆ సమయంలో ఉండటానికి చోటు కూడా లేదు

    టీనేజ్ ప్రెగ్నెన్సీతో ఆమె సమస్యలకు తెరపడలేదు. నటిగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఉండటానికి చోటు కూడా సరిగా లేదు. ఓ సారి ఆమె నాలుగు రోజుల పాటు రైల్వేస్టేషన్లోని ఫ్లాట్‌ఫాం మీదనే గడిపిందట.

    ఎన్నో కష్టాలుపడి...

    ఎన్నో కష్టాలుపడి...

    ఎన్నో కష్టాలు పడుతూ ఎవరి సహాయం లేకుండా మేఘా ధాదే నటిగా ఎదిగింది. స్కూలు రోజుల నుంచే ఆమెకు నటనపై ఆసక్తి ఉండేది. మొదట హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో పని చేసినా తర్వాత మరాఠీ ఇండస్ట్రీకి షిప్టయ్యారు. ఇపుడు బిగ్ బాస్ 12లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

    English summary
    Bigg Boss 12 has been a house of controversies ever since its premiere. Be it for the way the inmates perform in the tasks or the choice of words they make while communicating, every factor associated with Bigg Boss has managed to grab the viewers' attention. Recently, television actress and former Bigg Boss Marathi fame Megha Dhade became a part of the Bigg Boss 12 house as a wild card entrant. Not only does she have a hard time getting along with the contestants in the glass house, but she has had a rough past too. Did you know she had gotten pregnant before marriage? Here are a few more shocking facts about Megha Dhade!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X