అమర్ దీప్ - మానస్ మధ్య గొడవ.. 6 నెలల పాటు ఇలా.. బ్రహ్మముడి మానస్ కామెంట్స్
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు సీరియల్ నటులు మానస్ నాగులపల్లి. వైజాగ్ కు చెందిన ఈ యంగ్ టాలెంట్ ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆయన గుర్తింపు ఉన్న సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో అలరించారు. అలాగే తన డ్యాన్స్, టీవీ షోల ద్వారా కూడా మానస్ ప్రేక్షకులను, తన అభిమానులకు ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మానస్ జబర్దస్త్ వర్ష హోస్ట్ గా ప్రసారం అవుతున్న టాక్స్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కిసిక్స్ టాక్స్ షోలో బ్రహ్మముడి హీరో..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష ప్రస్తుతం హోస్ట్ గా మారిపోయింది. కిస్సిక్ టాక్స్ షో ద్వారా బుల్లితెర స్టార్స్ ను, వెండితెర సీరియర్ నటీనటులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తోంది. బిగ్ ఇప్పటికే 11 ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా 12 ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. లేటెస్ట్ ఎపిసోడ్ కు బ్రహ్మముడి హీరో, బిగ్ బాస్ మానస్ హాజరయ్యారు. ఆసక్తికరమైన విషయాల గురించి స్పందించారు.

అమర్ దీప్ తోపాటు ఆ ఇద్దరితో గొడవలు..
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మానస్ కు బిగ్ బాస్ అమర్ దీప్ అంటే ఎంత ఇష్టమో టెలివిజన్ ఆడియెన్స్ కు తెలిసిందే. పలు ఈవెంట్లు, టీవీ షోల్లో తమ స్నేహబంధాన్ని కనబరుస్తూనే ఉన్నారు. అలాగే టెలివిజన్ రంగంలో మానస్ నాగులపల్లికి చాలా మంది దగ్గరి స్నేహితులు ఉన్నారు. కాగా మానస్ కు కిస్సిక్ టాక్స్ లో ఇలా ప్రశ్న ఎదురైంది. అమర్ దీప్ చౌదరి, నిఖిల్, అర్జున్ తో మానస్ కు పోటీ ఉంటుందని, వారి మధ్య అప్పుడప్పుడు పడక గొడవలు కూడా ఉన్నాయంటూ రూమర్లు ఉన్నాయని వర్ష ప్రశ్నిస్తుంది. అందుకు మానస్ స్పందించారు.
6 నెలల పాటు..
అయితే, వర్ష అడిగిన ప్రశ్నకు మానస్ సమాధానం ఇచ్చారు. వారితో పడదనే విషయంపై స్పందిస్తూ.. ఒక ఆరు నెలలో అస్సలు ఎవ్వరినీ కలవలేదని, పైగా ఆ ముగ్గురిలో ఒకరు తననే చెడ్డవాడిగా ప్రచారం చేసే పనికి పూనుకున్నారని చెప్పారు. అయితే అమర్ దీప్ మానస్ మధ్య ఎప్పుడూ అలాంటి గొడవలు చూడలేదు. ఇక మానస్ ఎవరిని ఉద్దేశించి చెప్పారనేది హాట్ టాపిక్ గ్గా మారింది. రేపు సాయంత్రం 7 గంటలకు ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. దాంతో మానస్ పూర్తి మాటలు తెలియనున్నాయి.
మల్టీ టాలెంటెడ్ గా మానస్..
వైజాగ్ కు చెందిన మానస్ చిన్నప్పటి నుంచే కళారంగం వైపునకు అడుగులు వేశారు. చిన్న వయస్సులోనే డ్యాన్స్ లో అందరినీ ఆకట్టుకున్నారు. డ్యాన్స్ కు గాను చాలా అవార్డులను అందుకున్నారు. అలాగే చదువులోనూ మంచి మార్కులు సాధించి మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు అందుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. బాలకృష్ణ నర్సింహా నాయుడు చిత్రంలో బాల నటుడిగా నటించి నంది అవార్డ్ ను సైతం అందుకున్నారు. కోయిలమ్మ, పితృదేవో భవ, దీపారాధన, బ్రహ్మముడి సీరియల్స్ లో నటించారు. చివరిగా క్షీర సాగర మధనం చిత్రంతో వెండితెరపైనా మెరిశారు.


Click it and Unblock the Notifications











