For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీక్షా, సమీర్‌కు బిగ్‌బాస్ కఠిన శిక్ష.. ధన్నుకు సర్ప్రైజ్ గిఫ్ట్.. కంటతడి పెట్టిన హౌస్‌మేట్స్

  By Rajababu
  |

  బిగ్‌బాస్‌లో ఎప్పటిలానే గొడవలు, ఏడుపులు, టాస్క్‌లతో 19వ రోజు సాఫీగా గడిచిపోయింది. ఇంటి పనులను సరిగా చేయడం లేదనే కారణంతో దీక్షాపంత్, సమీర్‌లకు బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించడం తీవ్రమైన విషయంగా మారింది. అలాగే ఈతపోటి.. మెదడుకు మేత అనే టాస్క్‌ చాలా రొటీన్‌గా నడిచింది. ఈ టాస్క్‌లో ఓడిన ధన్‌రాజ్‌కు సర్ఫ్రైజ్ గిప్ట్ ఇవ్వడంతో ఆయన ఆనందంతోపాటు భావోద్వేగానికి గురయ్యాడు. ధన్‌రాజ్‌కు లభించిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను చూసిన ఇంటి సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో 19వ రోజు ఏమిజరిగిందంటే..

  రూల్స్ ఉల్లంఘిస్తున్నారు..

  రూల్స్ ఉల్లంఘిస్తున్నారు..

  బిగ్‌బాస్‌ ఇంటిలో సభ్యులు నిబంధనల ఉల్లంఘటనలకు పాల్పడుతున్నారనే కారణంతో కెప్టెన్ ప్రిన్స్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించాడు. ముమైత్, అర్చన, మహేశ్ కత్తి, అదర్శ్, దీక్షాలు ఇంటిలో తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతున్నారని బిగ్‌బాస్ హెచ్చరించాడు. ఒకవేళ ఇలానే వారి పద్ధతి కొనసాగితే కఠిన శిక్షలు అమలు చేస్తానని ప్రిన్స్ తెలియచేశాడు.

  Bigg Boss Telugu Episode 19 : Diksha Panth, Sameer was punished By Bigg Boss
  క్రమశిక్షణ నేర్పు..

  క్రమశిక్షణ నేర్పు..

  సభ్యులకు ఇంటిలో ఎలా ఉండాలనే క్రమశిక్షణ నేర్పే బాధ్యత నీపై ఉంది. ఒకవేళ వారు అందులో విఫలమైతే నీవు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని సంకేతాలను ప్రిన్స్‌కు ఇచ్చాడు. ఈ విషయాన్ని సభ్యులకు తెలియజేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇదే విషయాన్ని ఆయా సభ్యులకు ప్రిన్స్ వెల్లడించడంతో వారు నిబంధనలను ఫాలో కావాలనే అంగీకారానికి వచ్చారు. కానీ బిగ్‌బాస్ ఆదేశాలను వెంటనే బేఖాతరు చేయడం గమనార్హం.

  దీక్షా, సమీర్‌కు కఠిన శిక్ష

  దీక్షా, సమీర్‌కు కఠిన శిక్ష

  ఇక ఇంటి పనుల్లో భాగస్వామ్యం కానీ సమీర్, దీక్షాపంత్‌కు బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించాడు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉల్లిగడ్డలను కోస్తూ ఉండాలి అని శిక్ష విధించాడు. బిగ్‌బాస్ ఆదేశాలతో వారిద్దరూ రోజంతా ఉల్లిగడ్డలను కోస్తూ టాస్క్‌లో నిమగ్నమయ్యారు. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌పై సమీర్ విసుక్కోవడం కనిపించింది. టాస్క్ పూర్తయిన తర్వాత సమీర్ ఉల్లిగడ్డలను పారేస్తూ బిగ్‌బాస్‌పై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. సమీర్ వ్యవహారాన్ని బిగ్‌బాస్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.

  ఇంటి సభ్యులకు గేమ్

  ఇంటి సభ్యులకు గేమ్

  సమీర్, దీక్షా కఠిన శిక్ష అమలవుతుండగానే మిగితా సభ్యులకు బిగ్‌బాస్ ఓ గేమ్‌ను ఆడమని చెప్పారు. లాన్‌లో పద్దతిగా ఓ బొమ్మ అమర్చారు. ఆ పలకలను అలాగే స్విమ్మింగ్‌ పూల్ అడుగున పేర్చాలి అని సూచించాడు. దీనికి ఈతపోటి.. మెదడుకు మేత అనే పేరు పెట్టాడు. రెండు జట్లుగా సభ్యులను విభజించి ఒక జట్టుకు నాయకుడిగా ధన్‌రాజ్, మరో జట్టుకు నాయకురాలిగా ముమైత్ నియమించాడు.

  ధన్‌రాజ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్‌

  ధన్‌రాజ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్‌

  ఈ ఆటలో తక్కువ సమయంలో గెలుపొందిన ముమైత్‌కు ఓ బహుమతిని లేదా ధన్‌రాజ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్‌ను అందించే విధంగా రెండు ఆప్షన్లు ఇచ్చాడు. దాంతో ధన్‌రాజ్‌కు సర్పైజ్ గిఫ్ట్‌ను ఇవ్వమని ముమైత్‌ సూచించింది. దాంతో ధన్‌రాజ్ భార్య, కుమారుడు మాట్లాడిన వీడియోను ప్లే చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు బిగ్‌బాస్.

  మాపై బెంగ పెట్టుకోకు..

  మాపై బెంగ పెట్టుకోకు..

  వీడియోలో ధన్‌రాజ్ భార్య మాట్లాడుతూ.. మేము బాగా ఉన్నాం. నా ఆరోగ్యం చక్కగా ఉంది. నీవు బాగా ఆడుతున్నావు. ఇంటి సభ్యులు బాగా ఉన్నారు. నీవు మాపై ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. నీవు గేమ్ బాగా ఆడాలి. నీవు నాకు ఓ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చావు. నీవు ఇచ్చిన రెండో రోజున నీకు నేను ఓ గిఫ్ట్‌ను ఇస్తాను అని అన్నారు. ఆ తర్వాత కుమారుడు సుక్కు మాట్లాడుతూ.. నేను అమ్మను బాగా చూసుకొంటున్నాను. నీవు ఆందోళన పడొద్దు. అని అన్నాడు.

  ధన్‌రాజ్‌ను చూసి సభ్యులు..

  ధన్‌రాజ్‌ను చూసి సభ్యులు..

  భార్య, కుమారుడి మాటలు విని ధన్ రాజ్ ఓ వైపు సంతోషానికి, మరోవైపు భావోద్వేగానికి లోనయ్యాడు. ధన్‌రాజ్‌, ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమానురాగాలను చూసి ఇంటి సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అందరూ ధన్‌రాజ్‌ను హత్తుకొని ఓదార్చారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆదర్శ్ మౌనంగా రోదిస్తూ కనిపించాడు.

  ఇంట్లో అర్చన, దీక్షా గొడవ

  ఇంట్లో అర్చన, దీక్షా గొడవ

  ఇక 18వ రోజు ఆటలో అర్చన, కొత్తగా వచ్చిన దీక్షా సేథ్‌ల మధ్య వాగ్వాదం బాగానే జరిగింది. సేఫ్టీ పిన్నులు వారి మధ్య గొడవకు కారణమయ్యాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకొంటున్నావని దీక్షా పంత్.. నీవే తప్పుగా చూస్తున్నావని అర్చన ఒకరిపై మరొకరు వాగ్భాణాలు విసురుకున్నారు. ముమైత్‌కు దీక్షా తన గోడును చెప్పుకోగా, సమీర్‌కు అర్చన తన బాధను పంచుకొన్నది. పరభాషలో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన ముమైత్‌కు ఓ శిక్ష విధించడం గమనార్హం. అసలేం జరిగిందో 19వ ఎపిసోడ్‌లో చూడండి అని ఆసక్తిని పెంచారు.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. But it is going so so affair. There few mixed emotions seen in 19th episode of biggboss. Diksha Panth, Sameer was punished for not participating in house affairs. Biggboss given surprise gift for Dhanraj. overall Thursday episode has mixed elements.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X