For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ హౌస్‌లో డించక్..డించక్..మొదలయ్యింది: వైరల్ అవుతున్న దించక్ పూజా పాట (వీడియో)

  |

  దించక్ పూజ ఈ పేరు వింటేనే ఈ మధ్య సంగీత ప్రియిలు భయపడి పోతున్నారు, కాస్త గుండె బలం ఉన్నవారైతే. ఆ పేరు వినిపిస్తే చాలు ఎదుటివారి చెంప వాయగొట్టటమో, లేదంటే బూతుపురాణం ఎత్తుకోవటమో చేస్తున్నారు. అంతగా ఏం చేసిందీ పిల్ల అని అడిగితే మాత్రం మీరింకా అమాయకుల జాబితా లో ఉన్నట్టే. మరి ఒక్క తెలుగు బిగ్ బాస్ చూసి ఆపేస్తారా హిందీలో కూడా చూడకుంటే మీరు అప్ డేట్ లో లేనట్టే అన్నది లేటెస్ట్ ట్రెండ్ మరి...

  దించక్ పూజా

  దించక్ పూజా

  గతకొంత కాలంగా సంగీత ప్రియుల మీద పగబట్టిందో అమ్మాయి. దించక్ పూజా పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి తనో పేద్ద పాప్ స్టార్ అన్నలెవెల్లో తను పాడిన పాటలని, తన వింత ఎక్స్ప్రెషన్లతో కలిపి అప్ లోడ్ చేసింది... మొదట్లో కాస్త కామెడీ అనుకున్న జనం నవ్వుకుంటూ బాగానే చూసారు. కానీ తర్వాతే అర్థమయ్యింది అమ్మడు సీరియస్ గానే సింగర్ గా ట్రై చేస్తోందనీ, మరిన్ని వీడియోలు కూడా తమ మీద దాడి చేయటానికి సిద్దంగా ఉన్నాయని తెలిసి భయం తో బిక్క చచ్చి పోయారు.

   దించాక్ పూజ చానల్ ని బ్లాక్ అయ్యింది

  దించాక్ పూజ చానల్ ని బ్లాక్ అయ్యింది

  ఆ పాటలకి బెంబేలెత్తి భయం భయంగా బతుకుతున్న సమయంలోనే ఒక చల్లని వార్త చెప్పింది యూ ట్యూబ్. దించాక్ పూజ చానల్ ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించేసరికి ప్రజలంతా హమ్మయా అనుకున్నారు... అయితే కొన్నాళ్ళు కూడా జరగకముందే ఇంకో ఘోరం జరిగిపోయింది...

   హిందీ బిగ్‌బాస్‌లో

  హిందీ బిగ్‌బాస్‌లో

  క‌ర్ణ‌క‌ఠోర గొంతు, అర్థం ప‌ర్థం లేని లిరిక్స్‌తో పాట‌లు పాడి యూట్యూబ్‌లో సెన్సేష‌న్‌గా ఎదిగిన ఢించ‌క్ పూజ ఇటీవ‌ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిందీ బిగ్‌బాస్‌లో అడుగు పెట్టింది. పూజ అడుగు పెట్టిన మొద‌టి వారంలోనే టీఆర్‌పీల కోసం ఆమె ప్ర‌తిభ‌ను వాడుకోవ‌డం ప్రారంభించారు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు.

   బిగ్‌బాస్ హౌస్ గురించి పాట

  బిగ్‌బాస్ హౌస్ గురించి పాట

  అందుకోసం బిగ్‌బాస్ హౌస్ గురించి పాట పాడేలా చేశారు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా ఢించ‌క్‌తో బిగ్‌బాస్ పాట పాడించాడు. ఆ పాట వీడియోను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు పోస్టు చేశారు. చాలా రోజుల తర్వాత డించాక్.., డించాక్.. పాట విన్న ఆమె అభిమానులు ఆనందం తో గంతులేస్తూంటే... పాపం మిగతావాళ్ళంతా డించాక్ పూజని చూసిన ఆనదం లో మునకలేసారు...

  వైర‌ల్ అవుతోంది

  త‌న‌దైన శైలి లిరిక్‌ల‌తో ఢించ‌క్ పాడిన పాట ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వాళ్ల మీద సింగిల్ లైన్ కామెంట్లు చేస్తూ ఈ పాట రాయ‌డంలో ఇత‌ర కంటెస్టెంట్ల‌యిన అర్షి ఖాన్‌, ఆకాశ్ ద‌డ్లానీలు పూజ‌కు స‌హాయం చేశారు. ఏదేమైనా పూజ ఎంట్రీ రోజే ఆమె పాట‌ల‌ను హేళ‌న చేసిన స‌ల్మాన్‌, ఇప్పుడు పూజ బిగ్‌బాస్ ఇంటి లోప‌ల పాడిన పాట‌కు ఎలా స్పందిస్తాడో చూడాలంటే వీకెండ్ వార్ ఎపిసోడ్‌ వ‌ర‌కు ఆగాల్సిందే.. అప్పటిదాకా ఈ పాటని చూసి ఎంజాయ్ చేయాల్సిందే....

  English summary
  You Tube Singer Dinchak Pooja films her new video inside the Bigg Boss 11 house! Tune in tonight at 10:30pm to watch this new viral sensation!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X