అనసూయ బండారం బయటపెట్టిన మారుతి: అలాంటివే చేస్తుందంటూ అందరి ముందే షాకింగ్‌గా!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమదైన హోస్టింగ్‌తో అలరిస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తెగ సందడి చేస్తోంది గ్లామర్ క్వీన్ అనసూయ భరద్వాజ్. సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అనసూయ భరద్వాజ్ బండారాన్ని బయటపెట్టాడు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

జబర్ధస్త్‌తో అనసూయ టాప్‌లోకి

జబర్ధస్త్‌తో అనసూయ టాప్‌లోకి


అనసూయ 'నాగ' అనే సినిమాతో తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత న్యూస్ రిపోర్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత జబర్ధస్త్ షో ద్వారా హోస్టుగా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో అదరగొట్టేసిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీంతో వరుసగా షోలు చేసుకుంటూ అనసూయ తెలుగులో స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది.

సినిమాల్లో సత్తా... వరుస హిట్లు

సినిమాల్లో సత్తా... వరుస హిట్లు

బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా హవాను చూపిస్తోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తన మార్కును చూపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లనూ చేస్తూ రచ్చ చేస్తోంది.

భారీ సినిమాల్లోనూ అనసూయ

భారీ సినిమాల్లోనూ అనసూయ

ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది.

అందులోకి ఎంట్రీ.. జబర్ధస్త్‌లో

అందులోకి ఎంట్రీ.. జబర్ధస్త్‌లో

చాలా కాలంగా ఈటీవీలోనే సందడి చేస్తోన్న అనసూయ.. ఇటీవలే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. అలా వేరే ఛానెల్‌లోకి వెళ్లినా.. మరిన్ని ఆఫర్లను అందుకుంటోన్నా జబర్ధస్త్‌ను మాత్రం ఈమె వీడడం లేదు. తనకు లైఫ్ ఇచ్చిన షో కావడం వల్లే ఈమె దీనికి ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు.

జబర్ధస్త్‌ షోలో పక్కా కమర్షియల్

జబర్ధస్త్‌ షోలో పక్కా కమర్షియల్

చాలా మంది సీనియర్ టీమ్ లీడర్లు వెళ్లిపోయినా జబర్ధస్త్ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. అంతలా నిర్వహకులు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ను మరింత ఫన్నీగా రూపొందించారు. దీనికి 'పక్కా కమర్షియల్' మూవీ టీమ్ గోపీచంద్, మారుతి హాజరయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు.

అనసూయ కోసమే వచ్చానంటూ

తాజాగా విడుదలైన ప్రోమోలో గోపీచంద్ డైలాగులు, డైరెక్టర్ మారుతి తనదైన పంచ్‌లతో తెగ సందడి చేశారు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ అందరిపై తమ అభిప్రాయాలను చెబుతూ నవ్వించారు. ఈ క్రమంలోనే మారుతి 'ఓ పక్కా కమర్షియల్ యాంకర్‌ను కలుద్దామని వచ్చాం ఇవాళ' అంటూ అనసూయపై కామెంట్ చేశాడు. దీంతో ఆమె నోరు మూసుకుని మరీ షాక్‌కు గురైంది.

అనసూయపై మారుతి కామెంట్

అనసూయపై మారుతి కామెంట్

అంతేకాదు, డైరెక్టర్ మారుతి.. అనసూయ గురించి మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఈవిడ మామూలు కమర్షియల్ కాదు. చిన్న చిన్న పాత్రలు ఇచ్చినా చేయదు' అంటూ ఆమె బండారం బయటపెట్టేశాడు. దీంతో అనసూయ వెళ్లి ఆయన నోరు మూసేసింది. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగడంతో జడ్జ్‌లు, టీమ్ లీడర్లతో పాటు అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X