Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి.. రామ్ చరణ్, తారక్ విలన్స్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న సినిమా RRR జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో అయితే దర్శకుడు రాజమౌళి అన్ని భాషల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలో కూడా హీరోల ఇద్దరితోనూ సినిమాను చాలా కొత్తగా ప్రమోట్ చేయించాడు. అయితే రాజమౌళి డైరెక్ట్ చేసిన సన్నివేశం కూడా దర్శనమిచ్చింది.

భారీ స్థాయిలో ఓపెనింగ్స్
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని కూడా అందరిలో ఒక నమ్మకం ఉంది.

బిగ్ బాస్ లో RRR
అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలను తీసుకుని బాలీవుడ్ వైపు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఎక్కువగా టీవీ కంటెంట్ తోనే సినిమాను జనాలకి చేరువయ్యేలా చేస్తున్నాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న రాజమౌళి హీరోలతో కలిసి సల్మాన్ ఖాన్ నీ కూడా డైరెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సల్మాన్ ను డైరెక్ట్ చేసిన రాజమౌళి
దర్శకుడు SS రాజమౌళి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్‌తో ఎక్కువ సమయం గడిపాడు. చరణ్, తారక్ మరియు అలియా భట్‌లతో పాటు, RRR దర్శకుడు సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రోగ్రామ్‌లో స్పెషల్ గా కనిపించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, బిగ్ బాస్ 15 వేదికపై సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేయడానికి రాజమౌళి తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. ఆ స్టార్ హీరో కూడా అందుకు వెంటనే అంగీకరించాడు.

విలన్స్ గా చరణ్ తారక్..
రాజమౌళి దర్శకుడు కాగా అలియా భట్ కెమెరామెన్. ఇక తారక్-చరణ్ విలన్లుగా సల్లూ భాయ్‌ను హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. తారక్ చరణ్ ఇద్దరు కూడా రాజమౌళి స్టైల్ లో గన్ తో షూట్ చేయగా సల్మాన్ తన నోటిలో బుల్లెట్ పట్టుకుని మారణహోమాన్ని ఆపుతాడని ఊహించండి అని రాజమౌళి డైరెక్ట్ చేశాడు. ఇక బుల్లెట్ రావడం కనిపించ లేదు అని అలియా జోక్స్ వేసింది. ఇక ఆ తరువాత అది సీజీ లో చూసుకుంటాం అని రాజమౌళి చెబుతాడు.

రాజమౌళి యాక్షన్
చరణ్, తారక్ ఇద్దరూ చేసిన టాస్క్‌లో సల్మాన్ ఎలివేషన్ కు చాలానే హెల్ప్ చేశారు. ఏదేమైనా రాజమౌళి యాక్షన్ చెప్పగానే సల్మాన్ ఖాన్ నటించడం షోలో హైలెట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ తో పాటు రాజమౌళి కపిల్ శర్మ షోతో సహా ప్రస్తుత హిందీ టీవీ పరిశ్రమలోని దాదాపు అన్ని టీవీ షోలలో రాజమౌళి సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.