Teja: హీరో హీరోయిన్లను కొట్టడంపై తేజకు ప్రశ్న.. డైరెక్టర్ జవాబుకు పారిపోయిన కమెడియన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. జయం వంటి లవ్ స్టోరీ మూవీతో యావత్ తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను పరిచయం చేసిన ఈయన కెరీర్ లో విజయాలకంటే ఓటమిలే ఎక్కువగా చవిచూశారు. అంతేకాకుండా ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్లు చెప్పే తేజకు తాజాగా టీవీ షోలో హీరో హీరోయిన్లను కొట్టడంపై ప్రశ్న తలెత్తింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటనే విషయంలోకి వెళితే..

వర్మతో సినిమాలు: డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న తేజ అసలు పేరు జాస్తి ధర్మ తేజ. మద్రాసులో జన్మించిన తేజ సినిమాటోగ్రాఫర్ గా సినీ కెరీర్ ప్రారంభించారు. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకు అన్ని విభాగాల్లో పని చేసిన తేజ.. రాత్రి మూవీతో ఛాయగ్రహకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత అనేక దర్శకులతో పని చేసిన తేజ గోవిందా గోవిందా, రంగీలా తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేశారు.

]

Director Teja

తొలి హిట్టు: ఇక 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం మూవీతో దర్శకుడిగా అవతారం ఎత్తారు తేజ. ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అనంతరం జగపతి బాబుతో ఫ్యామిలీ సర్కస్ తెరకెక్కించి పర్వాలేదనిపించుకున్నారు. మరోసారి ఉదయ్ కిరణ్ తో చేసిన నువ్వు నేను మూవీ సంచలన విజయం సాధించింది.

Director Teja

స్టార్ డైరెక్టర్ రేంజ్: నువ్వు నేను సినిమాతో డైరెక్టర్ గా తేజ తెగ పాపులర్ అయ్యారు. అనంతరం 2002లో నితిన్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన మూవీ జయం. బ్యూటిఫుల్ సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యావత్ తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇలా వరుస హిట్లతో తేజ స్టార్ డైరెక్టర్ రేంజ్ కు ఎదిగిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా వీటిలా క్రేజ్ సంపాదించుకోలేకపోయాయి.

Director Teja

అప్పుడే హిట్.. తర్వాతే ప్లాప్: సంబరం, నిజం, జై, ఔనన్నా కాదన్నా, ధైర్యం, లక్ష్మీ కల్యాణం, కేక, నీకు నాకు డ్యాష్ డ్యాష్, వేయ్యి అబద్ధాలు సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో తేజ స్టార్ డమ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అనంతరం రానా దగ్గుబాటితో చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ కొట్టాడు తేజ. అనంతరం వచ్చిన సీత మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

Director Teja

టీవీ షోలో సందడి: ఇటీవలే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివిటీ టాక్ వస్తోంది. దీంతో తేజ కెరీర్ లో మరో ప్లాప్ పడినట్లే అంటున్నారు. ఇదిలా ఉంటే అహింస చిత్ర బృందం తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో పాల్గొంది.

నన్ను కొట్టండి సార్: ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి తేజతోపాటు సదా, హీరో అభిరామ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే "మీరు హీరోలను కొడతారు, వాళ్లను ఏదో అంటారు" అని ఎందుకు సార్ ఈ రూమర్ అని తేజను ఆటో రామ్ ప్రసాద్ అడిగాడు. దీనికి "కేవలం హీరోలనేనా" అని తేజ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. దీంతో "హో సెట్ సెట్ మొత్తం కొడతారా" అని భయపడుతూ తేజ దగ్గర కూర్చున్న రామ్ ప్రసాద్ లేచి వెళ్లిపోయాడు. అప్పుడు "ఎవరినో వద్దు సార్ నన్ను కొట్టండి" అని లేడీ గెటప్పు శాంతి అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X