ఉదయభానుతో అప్పట్లో అలాంటి రూమర్స్.. కావాలనే చేశారు అంటూ సీనియర్ దర్శకుడి వివరణ

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాంకర్స్ లలో ఉదయభాను ఒకరు. ఆమె ఎలాంటి షో చేసినా కూడా అప్పట్లో అన్ని వర్గాల అడియెన్స్ కు నచ్చేది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె ఎంతగానో ఆకట్టుకునేవారు. అయితే మ్యారేజ్ అనంతరం బుల్లితెరకు దూరమైన ఉదయభాను అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభానుతో ఒకప్పుడు వచ్చిన రూమర్స్ పై దర్శకుడు వీరభద్రం వివరణ ఇచ్చారు.

 చాలా కాలం నుంచి

చాలా కాలం నుంచి

ఈవివి.సత్యనారాయణ, తేజ వంటి దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన వీరభద్ర చౌదరి చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన ఇంకా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయారు. ఇంకా చిన్న బడ్జెట్ లోనే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.

ఉదయ్ కిరణ్ తో సినిమా క్యాన్సిల్

ఉదయ్ కిరణ్ తో సినిమా క్యాన్సిల్

వీరభద్రం తేజ డైరెక్ట్ చేసిన జయం, నువ్వు నేను వంటి సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేశాడు. ఇక నువ్వు నేను సినిమాతో ఉదయ్ కిరణ్ తో అప్పట్లో ఒక సినిమాను కూడా ఎనౌన్స్ చేశారు. కానీ ఉదయ్ కిరణ్ కు అప్పటికే పెద్ద బ్యానర్ నుంచి పిలుపు రావడంతో క్యాన్సిల్ అయ్యిందని వీరభద్రం తెలిపారు.

అల్లరి నరేష్ తో మొదటి హిట్టు

అల్లరి నరేష్ తో మొదటి హిట్టు

ఇక ఈవివి సత్యనారాయణ సినిమాలకు కూడా సహాయక దర్శకుడిగా వర్క్ చేయడంతో అల్లరి నరేష్ తో మొదటి అవకాశం వచ్చింది. ఆహా నా పెళ్ళంట అనే సినిమా ఏకంగా 100రోజులు ఆడింది. ఆ సినిమా హిట్టయిన తరువాత ఆఫర్స్ చాలానే వచ్చాయి. ఇక కమిట్మెంట్ ప్రకారం సునీల్ తో పూల రంగాడు ఒక సినిమా చేయాల్సి వచ్చిందని వీరభద్రం వివరణ ఇచ్చారు.

 ఉదయభానుతో రూమర్స్

ఉదయభానుతో రూమర్స్

వరుసగా రెండు సినిమాలు హిట్టవ్వడంతో వెంటనే నాగార్జునతో 'భాయ్' సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఒక్కసారిగా నన్ను ఆ ప్లాప్ తొక్కేసినట్లు అనిపించిందని చెప్పారు. ఇక ఆ సమయంలోనే యాంకర్ ఉదయభానుపై తనపై పలు రకాల రూమర్స్ వచ్చాయని అందులో ఎలాంటి నిజం లేదని వీరభద్రం తెలిపారు.

Recommended Video

Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
కావాలనే అలా చేశారు

కావాలనే అలా చేశారు

సాధారణంగా ఎవరైనా సరే పండ్లున్న చెట్లపైనే రాళ్లు వేస్తారు. అలాగే నేను కూడా అప్పట్లో వరుసగా రెండు హిట్ సినిమాలు తీసేసరికి కావాలని అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. నిజానికి ఉదయభానును నేను ఎప్పుడు కలవలేదు. ఎందుకు ఆ విధంగా చేశారో ఇప్పటికి అర్థం కాదు. ఇక నేను దర్శకుడిగా బిజీగా ఉండడం వల్ల అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని వీరభద్రం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X