Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌కు వెళ్తే విడాకులు ఇస్తానంది.. కుర్ర నటుడు కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు దర్శకుడు విజయ భాస్కర్ టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. ఇటీవల జిలేబి అనే సినిమాతో వచ్చారు. కానీ ఆశించని స్థాయిలో విజయం అయితే అందుకోలేకపోయింది. అయితే ఇదిలా ఉండగా ఆయన అల్లుడు నటుడు రవి శివ తేజ బిగ్ బాస్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

తెలుగులో అనేక షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన శివా రవితేజ అనే యువకుడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని జిమ్ లో శ్యామల అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆమె దర్శకుడు విజయభాస్కర్ కుమార్తె అనే విషయం తెలుసుకుని ముందు తడబడ్డాడు. ఊరు వెళ్ళిపోయినా తర్వాత ఆమె ప్రేమ కోసం హైదరాబాదు వచ్చి నటుడుగా స్థిరపడి విజయభాస్కర్ ముందుకు వెళ్లి ప్రేమను ఒప్పించుకుని వివాహం చేసుకున్నాడు. ఇక ఆమెను హీరోయిన్ గా లాంచ్ చేయాలనేది విజయ్ భాస్కర్ తాపత్రయం. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ప్రయత్నాలు చేస్తోంది.

Director vijay bhaskar son in law youtuber Ravi Shiva Teja shocking Comments on Bigg boss 7 Telugu Show

అయితే ఆ సంగతి ఎలా ఉంచితే తాజాగా బిగ్ బాస్ గురించి రవి శివ తేజచేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను బిగ్ బాస్ లోకి వెళతాను అంటే తన భార్య తనకు విడాకులు ఇచ్చేస్తానని బెదిరించిందని తనకు బిగ్ బాస్ లోకి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వ్యక్తిని అని తెలిసి కూడా ఆమె తనను ప్రేమించిందని ఆమెనే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒప్పించి వివాహానికి అన్ని సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు.

తాను తన భార్యను నాన్న అని పిలుస్తానని తన భార్య శ్యాముని మాత్రం తనను బంగారం మంటుంది అని చెప్పుకొచ్చారు. తనకు ఆడపిల్లలంటే ఇష్టమని తమ సంతానంలో ఆడపిల్లలు ఉండేలా చూసుకుంటామని ఆయన అన్నారు. ఇక నటుడిగా దాదాపు 400 పైగా వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించానని సినిమాల్లో కూడా చిన్నచిన్న అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Director vijay bhaskar

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ భాస్కర్ కుమారుడు కమల్ హీరోగా జిలేబి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయభాస్కర్ కుమారుడి సరసన హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ నటించిన మురళీ శర్మ రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నా... పూర్తిస్థాయిలో అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.

మొత్తం మీద ఇప్పుడు రవి శివ తేజ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ లోకి వెళితే ఏకంగా విడాకులు ఇవ్వటం ఏమిటి అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X