బిగ్ బాస్ రీఎంట్రీపై హాట్‌స్టార్ ట్వీట్ వైరల్: అనుకోకుండా వెళ్లిన ఆ కంటెస్టెంట్‌కే అవకాశం!
బిగ్ బాస్.. ఒకే రకమైన కార్యక్రమాలతో సాగుతోన్న తెలుగు బుల్లితెరకు సరికొత్త వన్నెను తీసుకొచ్చిన షో. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుండడంతో వరుసగా మూడు సీజన్లను పూర్తి చేసి, నాలుగో దానిని సైతం మొదలెట్టారు. మునుపటి సీజన్లలానే ఇది కూడా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో షోను మరింత రంజుగా మార్చేందుకు బిగ్ బాస్ యూనిట్ ఎలిమినేట్ అయిన వారిలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హాట్‌స్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

దానికి మార్పులు చేసి ఇలా మొదలెట్టారు
ఇంగ్లీష్‌లో చాలా కాలంగా ప్రసారం అవుతూ సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బ్రదర్. ఈ షో ఆధారంగానే బిగ్ బాస్‌ను రూపొందించారు. మొదటిగా దీనిని హిందీలో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ షో మొదలైంది. ఇక, నాలుగేళ్ల క్రితం మన నేటివిటీకి అనుగుణంగా మార్చేసి తెలుగులోనూ ఈ రియాలిటీ షోను స్టార్ట్ చేశారు.

మూడు సూపర్ హిట్.. నాలుగోదీ అలాగే
తెలుగులో బిగ్ బాస్ షో వరుసగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఎన్నో వివాదాలు అడ్డంకులుగా వచ్చినప్పటికీ నిర్వహకులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వాటిని విజయవంతంగా ప్రసారం చేశారు. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న నాలుగో సీజన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. అంతేకాదు, ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నేషనల్ లెవెల్లో రికార్డు క్రియేట్ చేసింది.

దీన్ని మాత్రం ప్రత్యేకంగా.. అందుకే అలా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌ను బిగ్ బాస్ యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. థియేటర్లు క్లోజ్ అయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనన్ని ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాలన్న పట్టుదలతో నిర్వహకులు పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులతో పాటు గతంలో చూడని వ్యూహాలను షోలోకి తీసుకు వస్తున్నారు.

రీఎంట్రీ.... వైల్డ్ కార్డ్ ఎంట్రీ.... ఇదే టాపిక్
బిగ్ బాస్ షోకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ టాపిక్ హైలైట్ అవుతోంది. షో చివరి దశకు చేరుకున్న తరుణంలో హౌస్‌లోకి ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొందరు అంటుండగా... మరికొందరు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరు రీఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్ అవుతోంది.
బిగ్ బాస్ రీఎంట్రీపై హాట్‌స్టార్ ట్వీట్ వైరల్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కుమార్ సాయి ఈ వారమే ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోను ప్రసారం చేస్తున్న డిజిటల్ మీడియా దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ రీఎంట్రీ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Recommended Video

అనుకోకుండా వెళ్లిన ఆ కంటెస్టెంట్‌కే అవకాశం!
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ చేసిన ట్వీట్‌లో రీఎంట్రీ గురించి ఓ పోల్ నిర్వహించింది. ‘ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు' అని ఆ పోల్‌లో ప్రశ్నించారు. దీనికి నోయల్, దివి, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ పేర్లను ఆప్షన్లుగా పెట్టారు. వీరిలో అనుకోకుండా వెళ్లిపోయిన నోయల్‌కు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం.


Click it and Unblock the Notifications











