twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌లో తెలుగు కంటెస్టెంట్లకు అన్యాయమా? భాష తెలియని సెలబ్రిటీల కోసమేనా రియాలిటీ షో?

    |

    టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటీనటులకు ప్రాధాన్యం ఇవ్వరు. పరభాషా నటీనటులనే దిగుమతి చేసుకొంటారు అనే విమర్శలు, అపవాదులు ఉన్నాయి. ఇలాంటి అపవాదులే ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు షోను వెంటాడుతున్నాయి. ఇంటిలో తెలుగు రాని, తెలుగు మాట్లాడం రాని సెలబ్రిలను కాపాడుతూ తెలుగు తెలిసిన ప్రతిభావంతులను బలి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా దివి ఎలిమినేషన్ తర్వాత ఇలాంటి విమర్శలు మరింత పెరిగాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    టీఆర్పీ కోసమే వారికి అండగా

    టీఆర్పీ కోసమే వారికి అండగా

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4లో ప్రధానంగా కరాటే కల్యాణి, దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి వద్యా ఎలిమినేషన్ల విసయంలో వివాదం నెలకొన్నది. కేవలం ఓట్ల ఆధారంగా కాకుండా కేవలం టీఆర్పీ కోసం కొందరని కాపాడుతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. రేటింగు కోసమే మోనాల్, తదితరులను కాపాడుతున్నారనే చర్చ ప్రధానంగా మారింది.

    కరాటే కల్యాణి ఎలిమినేషన్‌పై గరం గరం

    కరాటే కల్యాణి ఎలిమినేషన్‌పై గరం గరం

    ఇప్పటి వరకు ఎలిమినేషన్‌ విషయంలో కరాటే కల్యాణి విషయానికి వస్తే.. తెలుగు సంప్రదాయాలు, భాషలపై గట్టి పట్టు ఉంది. హరికథ, ఇతర కళల గురించి మంచి పట్టు ఉంది. ఆమెకు ఎక్కువగా అవకాశం ఇవ్వకుండా ఆరంభంలోనే బయటకు పంపించారు. ఆమె కూడా తనకు అన్యాయం జరిగిందనే విషయాన్ని పలు ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

    అత్యంత వివాదంగా దేవీ నాగవల్లి ఎలిమినేషన్

    అత్యంత వివాదంగా దేవీ నాగవల్లి ఎలిమినేషన్

    ఇక టీవీ9 ప్రజెంటర్ దేవీ నాగవల్లి ఎలిమినేషన్ విషయంలో మరింత వివాదం నెలకొన్నది. ఎక్కువగా అసంతృప్తి వ్యక్తమైంది దేవీ ఎలిమినేషన్‌పైనే. అయితే మోనాల్, కుమార్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా దేవీ నాగవల్లిని ఎలిమినేట్ చేశారనే అభిప్రాయం నెటిజన్లతో వ్యక్తమైంది. తన ఎలిమినేషన్‌పై దేవీ కూడా ఆశ్చర్యం ప్రకటించింది.

    కుమార్ సాయికి అన్యాయం జరిగిందంటూ

    కుమార్ సాయికి అన్యాయం జరిగిందంటూ

    ఇక వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంట్లోకి వెళ్లిన కుమార్ సాయిపై మొదటి నుంచి ఇంటి సభ్యులు నెగిటివిటీని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగానే కుమార్ సాయికి ఫుటేజ్ తక్కువగా లభించింది. ఇంటిలో గ్యాంగుల ప్రభావం కుమార్ సాయిపై పడింది. అయితే కుమార్ సాయికి కూడా ఓట్లు పడినా గానీ ఎలిమినేట్ అయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో కనిపిపించింది.

    జోర్దార్ సుజాత విషయంలో కూడా

    జోర్దార్ సుజాత విషయంలో కూడా

    ఇక జోర్దార్ సుజాత విషయంలో కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. తన ఎలిమినేషన్ ఊహించలేదని స్వయంగా నాగార్జునతో సుజాత చెప్పడం గమనార్హం. జోర్దార్ సుజాత ఎలిమినేషన్ తర్వాత నెటిజన్లు, ప్రేక్షకులు పెదవి విరిచారు. ప్రతిభావంతులకు సరైన న్యాయం జరగడం లేదు అంటూ కామెంట్ చేశారు.

    దివి వద్యా ఎలిమినేషన్‌పై నెటిజన్లు సీరియస్

    దివి వద్యా ఎలిమినేషన్‌పై నెటిజన్లు సీరియస్

    ఇక దివి విషయంలో ముందు నుంచే అలాంటి సంకేతాలు బయటపడ్డాయి. అన్ని అంశాలను బేరిజు వేసుకొని అందరూ దివి ఎలిమినేషన్ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. అనుకొన్నట్టుగానే దివి అసంతృప్తిగానే ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు దివి ఎలిమినేషన్‌పై చాలా చర్చ జరుగుతున్నది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
    తెలుగు కంటెస్టెంట్లకు అన్యాయం.. పరభాషా వారికి..

    తెలుగు కంటెస్టెంట్లకు అన్యాయం.. పరభాషా వారికి..

    ఇంటిలో తెలుగు భాష రాని కంటెస్టెంట్లను మేనేజ్‌మెంట్ కోటాలో కొనసాగిస్తున్నారనే ప్రచారం ఊపందుకొన్నది. బిగ్‌బాస్‌లో తెలుగు కంటెస్టెంట్లకు అన్యాయం జరుగుతున్నదనే ప్రచారానికి ఊపందుకొన్నది. అయితే నిర్వాహకుల ప్రమాణాలు ఏమిటో, ఎలాంటి డేటా ఆధారంగా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారనే అంశం సీక్రెట్ కాబట్టి.. ఇలాంటి విమర్శలు, ఆరోపణలకు సమాధానాలు ఏమిటనేది ప్రశ్నగా మారింది.

    English summary
    Divi Vadhtya exits from Bigg Boss Telugu's 7th week: Contraversy over Eliminations: Star actresss Samantha Akkineni to host Bigg Boss Telugu 4. Akhil Akkineni, Hyper Aadi, Payal Rajput, Kartikey Gummakonda special appearance in the show. Divi Vadthya eliminated from Bigg Boss Telugu 4, Samantha akkineni gets emotional.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X