Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దివితో కటీఫ్.. మోనాల్‌తో క్లోజ్‌గా... మళ్లీ ప్లేట్ ఫిరాయించిన సెలబ్రిటీ
బిగ్‌బాస్ ఇంటిలో ఎనిమిదో వారం కోసం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన సన్నివేశాలు కనిపించాయి. అరియానా, అవినాష్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఇంటి సభ్యుల మధ్య ఊగిసలాట కనిపించింది. కొందరు మాత్రం ప్లేట్ ఫిరాయించగా.. మరికొందరు స్థిరంగా తమ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఆ క్రమంలో దివి, మోనాల్, అమ్మా రాజశేఖర్ మధ్య సరదా సన్నివేశం జరిగింది. ఈ క్రమంలో అమ్మా రాజశేఖర్ నిర్ణయం వినోదంగా మారింది. అమ్మా ఏం చేశారంటే...
అవినాష్‌కు మోనాల్ సపోర్ట్
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అరియానాకు హారిక, దివి, మెహబూబ్, నోయల్ సీన్, మోనాల్ గజ్జర్ సపోర్టుగా నిలిచారు. అయితే అవినాష్ వైపు కూడా ఐదురుగు సభ్యులే ఉండటంతో ఫలితం తేలేలా కనిపించలేదు. ఆ క్రమంలో అవినాష్ చేసిన రిక్వెస్ట్‌కు అరియానా క్యాంపు నుంచి బయటకు వచ్చిన మోనాల్ తనకు సపోర్టుగా నిలిచింది.
నో అంటూ తెగేసి చెప్పిన దివి
దివిని కూడా అవినాష్ తనవైపుకు రావాలని కోరితే.. నేను అరియానాకు మాత్రమే సపోర్ట్ చేస్తాను. ఏది ఏమైనా అరియానాతోనే ఉంటానని తెగేసి చెప్పింది. అయితే ఈ క్రమంలోనే ఇంటిలో కొద్దికాలంగా క్లోజ్‌గా ఉంటున్న దివి, అమ్మా రాజశేఖర్ మధ్య సైగలు నడిచాయి. అవినాష్ వైపు రావాలని అమ్మా సైగ చేస్తే తాను రాను అంటూ సిగ్నల్ ఇచ్చింది.
దివితో రిలేషన్ కట్.. మనమిద్దరం ఫ్రెండ్స్
దాంతో తన పక్కనే కూర్చొన్న మోనాల్ గజ్జర్ ఏం జరుగుతున్నదని అమ్మా రాజశేఖర్‌ను అడిగితే.. దివితో రిలేషన్ కట్. ఇక నీతోనే ఫ్రెండ్ షిప్ అంటూ మోనాల్ చేతిలో చేయి వేసి అమ్మా రాజశేఖర్ ఒట్టు వేశాడు. అమ్మా రాజశేఖర్ మాటలకు మోనాల్ పడిపడి నవ్వే ప్రయత్నం చేసింది. ఇలా మోనాల్, అమ్మా రాజశేఖర్ మధ్య ఫన్నీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.
Recommended Video
అవినాష్‌ను ఆటపట్టించిన దివి
ఇదిలా ఉండగా, కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అవినాష్‌ను దివి పలుమార్లు ఆటపట్టించింది. అవినాష్ తోపుడు బండితో ఆమె ముందు నిలబడి తనవైపుకు రావాలని కోరితే.. సడన్‌గా లేచి రావడంతో అవినాష్ థ్రిల్ అయ్యాడు. వెంటనే సరదాగా లేచి వచ్చాను అంటూ మళ్లీ తన స్థానంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అవినాష్‌ను ఉద్దేశించి ఒక్క క్షణంగా గుండె ఆగినంత పని అయి ఉంటుంది కదా అంటూ దివి ఆటపట్టించింది.