బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్‌డేట్: షాకింగ్‌గా మోనాల్‌ సేవ్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్!

By Manoj Kumar P

తెలుగు బిగ్ బాస్ షో దేశంలోనే ది బెస్ట్ అని ఎన్నో సార్లు నిరూపించుకుంది. దీనికి కారణం అన్ని భాషలతో పోలిస్తే దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తుండడమే. ఇప్పటి వరకు జరిగిన సీజన్లు అన్నీ ఇదే తరహా ఫలితాన్ని అందుకున్నాయి. ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన నాలుగో సీజన్ సైతం సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సహా కొన్ని సర్‌ప్రైజ్‌ల కారణంగా రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం ఎలిమినేషన్ విషయంలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. షో నుంచి ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
ఆరంభం అదిరింది.. షో పేలుతోంది

ఆరంభం అదిరింది.. షో పేలుతోంది

బిగ్ బాస్ సీజన్ 4 గత నెలలో ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా సాగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ 18 పైచిలుకు రేటింగ్ సాధించి రికార్డుల్లోకెక్కింది. దీని తర్వాత మొదటి రెండు వారాలు సోసోగా సాగిన షో.. ఆ తర్వాత ఆసక్తికరంగా మారింది. దీంతో సీజన్ 4కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అది మాత్రం సస్పెన్స్‌గానే ఉందిగా

అది మాత్రం సస్పెన్స్‌గానే ఉందిగా

బిగ్ బాస్ షో విషయంలో మొదటి నుంచీ ఓటింగ్ మీద చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన సీజన్లు అన్నింటిలోనూ ఎలిమినేషన్ సమయంలో దీనిపై చాలా చర్చలే జరిగాయి. ఇక, ఈ సీజన్‌లో సైతం దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన తర్వాత ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీనికితోడు బయటకు వెళ్లిన కంటెస్టెంట్లు ఓటింగ్‌పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఆరు వారాలు.. ఏడురుగు అవుట్

ఆరు వారాలు.. ఏడురుగు అవుట్

బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటి వరకు ఏడు వారాలను పూర్తి చేసుకుంది. ఈ వారం మినహాయిస్తే గడిచిన ఆరు వారాలకు ఆరుగురు కంటెస్టెంట్లు (సూర్య కిరణ్, కరాటే కల్యాణీ, దేవీ నాగవల్లి, స్వాతీ దీక్షిత్, జోర్ధార్ సుజాత, కుమార్ సాయి) బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. అలాగే, వీరితో పాటు గంగవ్వ కూడా అనారోగ్య కారణాలతో షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఏడో వారం ఆరుగురు నామినేట్

ఏడో వారం ఆరుగురు నామినేట్

ప్రస్తుతం జరుగుతోన్న ఏడో వారంలో జంటలుగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో వీళ్లంతా ఆరుగురు సభ్యులు నోయల్, అభిజీత్, అవినాష్, మోనాల్, ఆరియానా, దివి నామినేట్ అయ్యారు. వీరందరూ బిగ్ బాస్ హౌస్‌లో బాగానే ఆడుతున్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే, దీనిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బిగ్ బాస్ నుంచి షాకింగ్ అప్‌డేట్

బిగ్ బాస్ నుంచి షాకింగ్ అప్‌డేట్

బిగ్ బాస్ షో ఏడో వారంలో మోనాల్ గజ్జర్ దాదాపుగా ఎలిమినేట్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నోయల్, ఆరియానా కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారని అంటున్నారు. కానీ, మోనాల్‌కే తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించి బిగ్ బాస్ షో నుంచి షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.!

ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.!

ఆదివారం జరగనున్న దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ వారం షో నుంచి దివి ఎలిమినేట్ అవుతుందట. ముందు నుంచీ అనుకుంటున్న మోనాల్‌ను సేవ్ చేసి.. ఆమెను బయటకు పంపబోతున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్‌తో బిగ్ బాస్ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు.

హృదయం ముక్కలైందంటూ పోస్ట్

హృదయం ముక్కలైందంటూ పోస్ట్

దివి ఎలిమినేట్ అయిందన్న వార్తలకు బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఆమె.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హృదయం ముక్కలైనట్లుగా ఓ ఎమోజీని స్టోరీగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన తర్వాత ఆమె ఎలిమినేషన్ నిజమేనన్న టాక్ బాగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X