బిగ్‌బాస్ తెలుగు 4 డిజాస్టర్.. మొన్న దేవి.. నిన్న దివి.. టీఆర్పీ ట్రిక్కులకు బలి చేశారా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షోలో ఎలిమినేషన్లపై అనేక అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభావంతులైన కంటెస్టెంట్లను బయటకు పంపిస్తూ.. టీఆర్పీ కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దివి వద్యా ఎలిమినేషన్ తర్వాత నెటిజన్ల ఆగ్రహం మరింత కనిపించింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఇవే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, దివి లేకుండా బిగ్‌బాస్ చూడలేను అంటూ నెటిజన్లు!!
దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన రోజే..

దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన రోజే..

ఎలిమినేషన్లను బట్టి చూస్తే బిగ్‌బాస్ తెలుగు సీజన్ డిజాస్టర్. దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన రోజే షో ప్రతిష్ట మంటగలిసింది. గంటసేపు ప్రేక్షకులు ఈ షో చూస్తే.. అందులో 30 నిమిషాలు మోనాల్, అఖిల్, అభి ట్రాయంగిల్ లవ్ లేదా సోహైల్, మెహబూబ్, అరియానా గురించే చూపిస్తారు. అవినాష్ ఫేక్ కామెడీ చేస్తున్నాడు అంటూ ఓ నెటిజన్ భగ్గమన్నాడు.

దేవిని ఎందుకు ఎలిమినేట్ చేశారు..

దేవిని ఎందుకు ఎలిమినేట్ చేశారు..

గత ఎలిమినేషన్లను కూడా నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దేవీ నాగవల్లిని ఎందుకు ఎలిమినేట్ చేశారు? మెహబూబ్, కుమార్ సాయి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా దేవీని ఎలిమినేట్ చేయడం వెనుక కారణం ఏమిటి? ఇలాంటి విషయాలను బిగ్‌బాస్ నిర్వాహకులను నిలదీయాలి. సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ను ప్రశ్నించండి అంటూ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంత చెత్త సీజన్ మరోటి ఉండదు

ఇంత చెత్త సీజన్ మరోటి ఉండదు

మొన్న దేవీ.. నేడు దివి.. బలమైన కంటెస్టెంట్లను బిగ్‌బాస్ ఎలిమినేట్ చేస్తున్నాడు. బిగ్‌బాస్ కోసం ఓటింగ్ చేయడం టైం వేస్ట్. స్ట్రిప్టింగ్ ప్రకారంమే షోను నడుపుతున్నారు. మిగితా సీజన్లతో పోల్చుకొంటే ఇంత చెత్త సీజన్ మరోటి లేదు అని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లు వేసే ప్రజలు వెధవలా?

ఓట్లు వేసే ప్రజలు వెధవలా?


బిగ్‌బాస్ షో కోసం వేస్తున్న ఓట్లను సీరియస్‌గా పరిగణిస్తున్నారా? టీఆర్పీ ట్రిక్కులను అర్థం చేసుకోలేరని ప్రజలను వెధవలుగా లెక్క కడుతున్నారా? దివిని ఎలిమినేట్ చేసి.. మోనాల్‌ను సేఫ్ చేయడం కరెక్ట్‌నా? అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.

మేనేజ్‌మెంట్ కోటా కోసమేనా?

మేనేజ్‌మెంట్ కోటా కోసమేనా?

గత ఎలిమినేషన్లతోపాటు దివి ఎలిమినేషన్ చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాను స్టార్ మా కాపాడుతున్నది. అందుకే దివి లాంటి వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారు అని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X