ఒకర్ని ఓడించి గెలిస్తే.. అది గెలుపే కాదు.. తొటి కంటెస్టెంట్‌పై దివి ఫైర్.. రాహుల్‌ వద్ద కంటతడి

బిగ్‌బాస్ తెలుగు షో నుంచి దివి వద్యా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ తర్వాత వేదికపై నుంచి వచ్చిన దివి.. సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ తీరును తప్పుపట్టారు. అవినాష్‌ విషయంలో అలాంటి అభిప్రాయం ఏర్పడటానికి ఆయన బిహేవియర్ కారణం అంటూ దివి చెబుతూ..

టాస్క్‌ల విషయానికి వస్తే..

టాస్క్‌ల విషయానికి వస్తే..

కామెడి చేసి అవినాష్ సింపతి సంపాదిస్తున్నట్టు నేను అనుకోవడం లేదు. నాకు మాత్రం అలాంటి విషయం అతడిలో కనిపించలేదు. కానీ అతడితో మాట్లాడినప్పుడు నేను గేమ్ ఆడటానికే వచ్చాను. ఫ్రెండ్స్, గేమ్‌ను కలుపనని చెప్పాడు. అప్పుడే నాకు ఆయనపై ఒపినియన్ ఫామ్ అయింది అంటూ రాహుల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో దివి వెల్లడించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌తో దివి మాట్లాడుతూ...

అవినాష్‌పై గరం గరం

అవినాష్‌పై గరం గరం

అవినాష్ కామెడీ చేసినగానీ.. టాస్క్ విషయానికి వస్తే చాలా స్ట్రిక్టుగా ఉంటాడు. ఇతరులు టాస్క్ ఆడే సమయంలో చాలా డిస్ట్రబ్ చేస్తాడు. నేను పేడలో కాయిన్స్ తీసేటప్పుడు నాకు గురించి కామెంట్ చేస్తూనే ఉన్నాడు. చల్లటి పేడలో చేతులపెట్టి కాయిన్స్ వెదుకుతుంటే చేతులు, కాళ్లు వణికిపోయాయి. అలాంటి సమయంలో కెమెరా ముందుకు వెళ్లి అవినాష్ నాపై కామెంట్ చేశాడు అని దివి పేర్కొన్నారు.

బెలూన్స్ పగలకొట్టే టాస్క్‌లో

బెలూన్స్ పగలకొట్టే టాస్క్‌లో

ఎవరైనా టాస్క్‌లో గెలువాలనుకోవడం తప్పులేదు. కానీ పక్కనోడు ఓడిపోతే గెలువాలనుకోవడం తప్పు. నేను బెలూన్స్‌ పగలకొట్టే గేమ్‌ ఆడుతున్నప్పుడు పక్కనే అవినాష్ నన్ను నిరుత్సాహ పరిచారు. నువ్వు బెలూన్స్ కొట్టలేవు అంటూ పక్క నుంచి అవినాష్ అరుస్తున్నాడు. నేను ఎప్పుడు యారోను విసిరి నేను బెలూన్ పగలకొట్టలేదు. గన్‌తో గానీ వేరే రకంగా పగలకొట్టాను గానీ అలా పగలకొట్టలేదు అని దివి తెలిపింది.

నాగార్జున అలా అనడంతో

నాగార్జున అలా అనడంతో

నాగార్జున సార్ నన్ను చూసి బ్యూటిఫుల్‌గా ఉన్నావని చెప్పడంతో బాగా జోష్ పెరిగింది. దాంతో బాణం తీసుకొని బెలూన్ పగలకొట్టాను. అలా అవినాష్ నిరుత్సాహ పరిస్తే బాధ అనిపించింది. మా నాన్న ఎప్పుడు నీవు బాగా చేస్తావు అని చెబుతుంటాడు. అందుకే నేను ఏదైనా చేయగలననే ఫీలింగ్ కలుగుతుందని దివి కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహ పరిస్తే

ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహ పరిస్తే

బిగ్‌బాస్ వేదికగా ఒకటే చెప్పాలనుకొంటున్నాను. ఎవరైనా మీరు ఈ పని చేయలేవు అని అంటే దానిని పట్టించుకోవద్దు. నెగిటివ్ విషయాన్ని మనం పట్టించుకోవద్దు. మీరు ఏదైనా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవినాష్ నన్ను అలా అనడం నాకు నచ్చలేదు అంటూ దివి తన మనసులోని మాటలను రాహుల్ సిప్లిగంజ్‌కు చెప్పారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన దివిని రాహుల్ తన మాటలతో కూల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X