శృంగార తారలా మారిన బిగ్ బాస్ దివి: వాటిని చూపిస్తూ అందాల ఆరబోత
ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు అవకాశాలను అందుకోవడమే కష్టంగా ఉండేది. అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ఎంతో మంది అమ్మాయిలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే తన క్రేజ్‌ను పెంచుకుంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

చాలా కాలం క్రితమే వచ్చినా
అచ్చ తెలుగు అమ్మాయి దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా టాలీవుడ్‌లోకి అడుగెట్టింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ చిన్న పాత్రను చేసింది. ఇలా వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించినా దివికి సరైన గుర్తింపు, పేరు మాత్రం దక్కలేదనే చెప్పాలి.

ఆ ఒక్క షోతో కెరీర్ మారింది
సినిమా నటిగా సత్తా చాటుతోన్న సమయంలోనే దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఈ షోతో ఆమె కెరీర్‌కు ఊపు వచ్చేసింది.

వరుస సినిమాలు.. ఆ సీన్‌లో
బిగ్ బాస్ షో పుణ్యమా అని దివి వాధ్యాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ఫలితంగా ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

చిరంజీవితోనే.. భారీ ఆఫర్లు
దివి వాధ్యా పాల్గొన్న సీజన్‌లో ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవి.. ఆమె అందానికి ఆకర్షితులు అయ్యారు. అంతేకాదు, 'భోళా శంకర్' సినిమాలో చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్'లో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. దీనికి దివి వాధ్యా న్యాయం చేసిందనే చెప్పాలి. ఈ కారణంగా ఆమెకు మరిన్ని భారీ సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే పోస్ట్
గతంలో కంటే ఇప్పుడు దివి వాధ్యా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఫలితంగా తన దివి వాధ్యా పేరు మరింత హైలైట్ అవడంతో పాటు ఈ బ్యూటీ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

శిల్క్ స్మితలా మారిన దివి
అచ్చ తెలుగమ్మాయి దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బొడ్డు కింద వరకూ చీర కట్టుకుని, క్లీవేజ్ షో చేస్తూ ఘాటు ఫోజులు ఇచ్చింది. ఇలా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. అంతేకాదు, అలనాటి శృంగార తార శిల్క్ స్మితను గుర్తు చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











