ఈల వేసి గోల చేస్తున్న దివి.. చిలిపిగా, అల్లరిగా, రొమాంటిక్‌గా బ్యూటీ హంగామా
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 రికార్డుస్థాయిలో టేకాఫ్ అందుకొన్నది. షో ప్రారంభమైన తర్వాత కంటెస్టెంట్లపై ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా హీరోయిన్లు, హీరోలు షోలోకి వస్తారనుకొంటే యాంకర్లను, సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వారిని తెరపైకి తీసుకు రావడంతో కొంత అసంతృప్తికి గురయ్యారు. కానీ షో రెండో వారంలోకి ప్రవేశించిన తర్వాత యంగ్ సెలబ్రిటీల జోరు విశేషంగా ఆకట్టుకొంటున్నది. తాజా సీజన్‌లో దివి చలాకీతనం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. బిగ్‌బాస్ తెలుగు 4 షోలో దివి గురించి క్లుప్లంగా..

ఫస్ట్‌లుక్‌లోనే అందంతో కట్టిపడేసి
బిగ్‌బాస్ వేదికపైకి చేరుకొన్న దివి వద్యా ఫస్ట్ లుక్‌లోనే ఆకట్టుకొన్నారు. మంచి అందం, అభినయంతో ఆ తర్వాత ఇంట్లో హడావిడి సృష్టిస్తున్నారు. వివాదాస్పదంగా గేమ్‌లో ఉండకుండా.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దివి ప్రయత్నిస్తున్నారు. ఆమె చలాకీ తనం, హడావిడి మరింత ఆసక్తిగా మారింది.

ఉత్సాహంగా దివి దూసుకెళ్తూ
బిగ్‌బాస్ పెట్టే టాస్కుల్లో దివి ఉత్సాహంగా పాల్గొంటూ తనవైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన టాస్క్‌లో సెన్సిబుల్‌గా ఆడుతూ మెల్లమెల్లగా తన గేమ్ ప్లాన్‌ను అమలు చేస్తున్నది. ప్రతీ కంటెస్టెంట్‌తో మంచి రిలేషన్స్‌ను కొనసాగిస్తూ వివాదరహిత కంటెస్టెంట్ అనే ముద్రను వేసుకొంటున్నది.

అమ్మా రాజశేఖర్‌తో స్టెప్పులు
ఇక డ్యాన్స్ బేస్డ్‌డ్ టాస్క్‌లో దివి జోరు మాములుగా ఉండటం లేదు. బుధవారం రాత్రి అమ్మా రాజశేఖర్ డ్యాన్స్ సందర్భంగా కరాటే కల్యాణితో కలిసి వేసిన స్టెప్పులు ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకొన్నది. రాజశేఖర్ మాస్టర్‌తో చిలిపిగా వ్యవహరిస్తు వయ్యారాలు ఒలకబోస్తున్నది. ఇలలు కొడుతూ అల్లరిని ఓ రేంజ్‌లో కొనసాగిస్తున్నది.

క్లాసికల్ డ్యాన్స్‌తో హంగామా
బుధవారం నాటి టాస్క్‌లో అమ్మా రాజశేఖర్‌తో కలిసి శాస్త్రీయ నృత్యాన్ని ప్రాక్టీస్ చేసిన సన్నివేశం సరదాగా సాగింది. సాంప్రదాయ నృత్యంతో దివి వేసిన స్టెప్పులు.. అమ్మ రాజశేఖర్‌తో చేసిన హంగామా దివి గేమ్ ప్లాన్‌కు అద్దం పట్టింది. ఇలా చాపకింద నీరులా దివి తన గేమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నది.

మెహబూబ్‌తో రొమాంటిక్‌గా
ఇక కంటెస్టెంట్ మెహబూబ్‌తో దివి చేస్తున్న సింపుల్ రొమాన్స్ కూడా ఆకట్టుకొన్నది. ఎవరినీ వదిలి పెట్టకుండా అందరిని కవ్వించే విధంగా దివి గేమ్‌ను తనవైపు తిప్పుకొనేలా వ్యవహరిస్తున్నది. మెహబూబ్ ఎత్తుకొన్న సీన్‌లో దివి చిరకట్టులో అదరగొట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తన గేమ్ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Recommended Video

బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్
మహర్షి చిత్రంలో అతిథి పాత్రకే పరిమితమైన దివి ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో వచ్చిన బిగ్‌బాస్ ఆఫర్‌ను అందిపుచ్చుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్లాన్ చేసింది. బిగ్‌బాస్ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకొనే సెలబ్రిటీలో దివి తప్పక ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


Click it and Unblock the Notifications











