‘జబర్దస్త్ ఆఫర్‌ను అందుకే రిజెక్ట్ చేశా.. అనసూయ స్థానంలో హోస్ట్‌గా అవకాశాన్ని వదిలేశా!’
తెలుగు ప్రేక్షకులకు దివి వద్త్య (Divi Vadthya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వీడియో సాంగ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. బిగ్‌బాస్‌కు ముందు కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆ షో తర్వాతే దివికి పెద్దగా గుర్తింపు వచ్చింది. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్, గ్లామర్ ఉన్నప్పటికీ దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన దివి, ఇటీవల వచ్చిన లంబసింగి సినిమాలో కూడా నటించింది. అయినప్పటికీ ఆమె కెరీర్‌లో ఒక పెద్ద బ్రేక్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.
జబర్దస్త్ ఆఫర్ మిస్ అయిన దివి
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దివి తన కెరీర్‌లో మిస్ అయిన ఒక పెద్ద అవకాశాన్ని గుర్తుచేసుకుంది. ప్రముఖ కామెడీ షో జబర్థస్త్ (Jabardasth) లో యాంకర్‌గా అవకాశం తనకే ముందుగా వచ్చిందని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో అనసూయ (Anasuya Bharadwaj) వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులు షోకు రాలేకపోయారని, అప్పుడు జబర్దస్త్ టీమ్ తనను సంప్రదించిందని దివి తెలిపింది. 'మీరు యాంకరింగ్ చేస్తారా?' అని అడిగారని, అది నిజంగా చాలా మంచి అవకాశం అని కూడా ఆమె చెప్పింది. కానీ ఆ సమయంలో తనకు యాంకరింగ్ రాదనే భయం ఎక్కువగా ఉండడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించానని దివి చెప్పింది. 'నాకు యాంకరింగ్ చేతకాదు అనిపించింది. ఆ భయంతో ఆ అవకాశాన్ని వదిలేశాను'అంటూ ఆమె గుర్తు చేసుకుంది.

రెండోసారి ఛాన్స్ కూడా మిస్
అయితే కొంతకాలం తర్వాత మళ్లీ అదే షో నుంచి కాల్ వచ్చిందని దివి తెలిపింది. అనసూయ షో నుంచి వెళ్లిపోతున్నారు అని, మీరు యాంకర్‌గా చేయాలా అని మరోసారి అడిగారని ఆమె వెల్లడించింది. అప్పటికే తాను సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని భావించి, యాంకరింగ్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించానని చెప్పింది. ఆ సమయంలో తన స్నేహితులను కూడా అడిగానని తెలిపింది. కొందరు యాంకరింగ్ చేయమని చెప్పగా, మరికొందరు మాత్రం సినిమాలపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారని వెల్లడించింది. చివరికి సినిమాల కోసం ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకుని జబర్దస్త్ యాంకరింగ్ అవకాశాన్ని కోల్పోయానని దివి చెప్పింది. 'అప్పుడు ఆ అవకాశం తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో'అని ఆమె ఎమోషనల్‌గా పేర్కొంది.
ఇండస్ట్రీలో కష్టాలు
సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని కూడా దివి వెల్లడించింది. కొందరు లావుగా ఉన్నావని సన్నగా అవ్వమని, మరికొందరు సన్నగా ఉన్నావని లావు అవ్వమని చెప్పేవారని ఆమె తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తన శరీర ఆకృతిని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది. ఒకసారి హీరో రవితేజ సినిమా కోసం కూడా తనను ఎంపిక చేసినట్లు చెప్పారు. తన హైట్, ఫిజిక్ సినిమాకు బాగా సరిపోతుందని చెప్పినా చివరికి ఆ అవకాశం కూడా దక్కలేదని దివి బాధపడింది. ఈ నిరాశలను తట్టుకోలేక ఇంటికి వెళ్లి షవర్ కింద నిలబడి చాలా సార్లు ఏడ్చానని కూడా తెలిపింది.
సోషల్ మీడియాలో హల్చల్
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమాల అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల దివి షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వింటేజ్ లుక్‌లో కాలికి కడియాలు, వంకీలు ధరించి పోజులిచ్చిన ఈ బ్యూటీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలతో ఇచ్చిన పోజులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఇలా తన గ్లామర్, స్టైలిష్ లుక్‌తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానులను అలరిస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











