ర్యాప్‌ సాంగ్‌తో దివి వద్యా జోష్.. నోయల్‌ సీన్‌కు ఆ ముగ్గురు సర్‌ప్రైజ్.. గంగవ్వదే హవా..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటి షో సీజన్ 4లో ఐదో రోజు సరదాగా సాగిపోయింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లు, వంటలతో ఇంటి సభ్యులు కాలక్షేపం చేశారు. రొమాంటిక్ మూడ్‌తో సభ్యులు ఎంజాయ్ చేశారు. అలాగే కట్టప్ప ఎవరు అనే విషయంపై నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ టాస్క్ విషయంలో నోయల్ సీన్, అఖిల్, ఇతర ఇంటి సభ్యుల మధ్య గొడవ ఎలా జరిగిందంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 5 Highlights దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా
ఇంటి సభ్యులకు షాకిచ్చిన బిగ్‌బాస్

ఇంటి సభ్యులకు షాకిచ్చిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ పల్ప్ అండ్ బాటిల్ టాస్క్‌ను ఇంటి సభ్యులు పూర్తి చేశారు. అయితే ప్రతీ జట్టు నుంచి 30 బాటిళ్లు ఇవ్వమని కోరితే ఆ రిక్వెస్ట్‌ను పూర్తి చేయకపోవడంతో వారికి కేటాయించిన 1400 పాయింట్ల నుంచి కట్ చేసి 2000 పాయింట్లు ఇచ్చారు. దీంతో ఇంటి సభ్యులు షాక్ గురియ్యారు.

అల్లు అర్జున్ పాటతో ఐదో రోజు షురూ..

అల్లు అర్జున్ పాటతో ఐదో రోజు షురూ..

ఇంటి సభ్యులు 5వ రోజు అల్లు అర్జున్ జులాయి చిత్రంలో పకడో పకడో పాటతో ఆరంభమైంది. ఇంటి సభ్యులందరూ జోష్‌తో డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంటి సభ్యుల్లో అఖిల్, మెహబూబ్ వర్కవుట్లు చేస్తుంటే.. వారితో పాటు గంగవ్వ కూడా ఎక్సర్‌సైజులు చేసింది. గంగవ్వ వర్కవుట్ చూసి అఖిల్, నోయల్ ఆశ్చర్యపోయారు.

గంగవ్వతో అరియానా గ్లోరి

గంగవ్వతో అరియానా గ్లోరి

గంగవ్వ వర్కవుట్ తర్వాత నోయల్, అరియానా గ్లోరి, అఖిల్ సార్థక్ మీటింగ్ పెట్టారు. గంగవ్వ నీ వయసు అంటే 62 సంవత్సరాలు చెప్పారు. తనకు 7 గురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని చెబితే అరియానా షాక్ అయ్యారు. మీకు ఇద్దరు ముగ్గురో మనవరాళ్లు ఉంటారనుకొన్నా అంటూ అరియానా అన్నారు.

మోనాల్ గజ్జర్‌కు కరాటే కల్యాణికి ఫైట్

మోనాల్ గజ్జర్‌కు కరాటే కల్యాణికి ఫైట్


ఇంటి సభ్యులందరూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మోనాల్ గజ్జర్ టిఫిన్స్ రెడీ చేస్తుంటే అందరూ కూర్చొని ఆరగించారు. అయితే తాను వెజిటేరియన్ కాబట్టి.. ఎగ్స్, ఇతర వస్తువులను ఇందులో కలపకండి అంటూ హిందీలో చెబితే కరాటే కల్యాణి తెలుగులోకి అనువదించారు. అయితే చిన్న విషయంపై అలిగి నేను బ్రేక్‌ఫాస్ట్ చేయనని కరాటే కల్యాణి వెళ్లిపోయింది. వాళ్లే డామినేట్ చేస్తే మేమెందుకు ఉండి అంటూ కల్యాణి ఫైర్ అయ్యారు.

దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా

దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా


బిగ్‌బాస్‌ కిచెన్‌లో అమ్మ రాజశేఖర్, దివి వద్యా మధ్య రొమాంటిక్ డైలాగ్స్ సరదాగా సాగిపోయాయి. దివి మైకంలో పడి పెనంలో వేడిగా ఉన్న నూనెలో చాయ్‌పత్తా వేసిన అమ్మా రాజశేఖర్ తలబాదుకొన్నారు. దాంతో రొమాన్స్ ఎక్కువైంది అంటూ సూర్య కిరణ్ సెటైర్ వేశాడు. ఆ తర్వాత నోయల్ అందరిపై ర్యాప్ పాటల కడుతూ హుషారెత్తించారు.

దివి ర్యాప్ సాంగ్‌తో నోయల్ సీన్‌కు

దివి ర్యాప్ సాంగ్‌తో నోయల్ సీన్‌కు

ఇక మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే, దేవీ, దివి వద్యా, మెహబూబ్ ర్యాప్ పాటతో నోయల్‌ సీన్‌కు షాక్ ఇచ్చారు. నోయల్‌పై పాటకట్టి ర్యాప్ సాంగ్ మాదిరిగా పాడుతూ దేవీ, దివి, మెహబూబ్ డ్యాన్స్ చేశారు. ఈ ముగ్గురి డ్యాన్స్‌తో నోయల్ సీన్ ఆనందంలో మునిగిపోయాడు. ఆ తర్వాత వారితో కలిసి సంతోషాన్ని పంచుకొన్నారు. ఆ తర్వాత కట్టప్ప ఎవరు అనే టాస్క్ సందర్భంగా తనకు తాను కట్టప్ప ప్రకటించుకోవడాన్ని ఇంటి సభ్యులందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై అఖిల్, నోయల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X