ఆఫర్ల కోసం దగ్గర కాలేదు.. ఆయనతో అలాంటి బంధం.. దివి వద్యా సంచలన కామెంట్స్
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన దివి వద్యా తొలిసారి పెదవి విప్పి మీడియాతో మాట్లాడింది. దసరా మెగా ఎపిసోడ్ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన దివి కొద్ది రోజులుగా మీడియాకు దూరం ఉన్నారు. ఆ సంఘటన నుంచి తేరుకొన్న తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా అమ్మా రాజశేఖర్‌తో ముడిపడి ఉన్న వివాదంపై స్పందిస్తూ...

అందుకే దూరంగా ఉన్నా
సాధారణంగా నేను ఎవరితోనైనా కలువడానికి కొంచెం సమయం తీసుకొంటాను. గత రెండువారాలుగా నా తోటి కంటెస్టెంట్లతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నాను. యువ కంటెస్టెంట్లతో దూరంగా ఉండాలని ముందుగా నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే ఇంట్లో వారితో మసాలా కంటెంట్‌కు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో వారితో కలువలేదు అని దివి చెప్పారు.

అమ్మ లాంటి రిలేషన్
అమ్మా రాజశేఖర్‌తో నా రిలేషన్ చాలా పవిత్రమైంది. ఆయనతో నాకు అమ్మ లాంటి రిలేషన్ ఉంది. ఇంటిలో బాధ కలిగినప్పుడు ఏడవడానికి బదులు సంతోషంగా ఉండాలనే నిర్ణయించుకొన్నారు. అమ్మా రాజశేఖర్ చాలా జోవియల్. ఎప్పుడూ ఇతరులను హ్యాపీగా ఉంచాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకే అతడికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకొన్నాను అని దివి అన్నారు.

అమ్మ రాజశేఖర్‌తో అలాంటి రిలేషన్
అమ్మా రాజశేఖర్ కొన్నిసార్లు నాటు, చిలిపి జోకులు వేస్తారనే విమర్శలు వచ్చాయి. కానీ అవి అంతగా హానీకరం కాదు. ఇబ్బందిగా ఉంటే అలాంటి జోకులు వేయవద్దని ముఖంపైనే చెప్పేదానిని. ఆయన కూడా తనను తాను కరెక్ట్ చేసుకొనే వారు. సొంత ప్రయోజనాల కోసం అమ్మా రాజశేఖర్‌తో రిలేషన్ పెంచుకొన్నాననే విషయంలో వాస్తవం లేదు అని దివి తెలిపారు.
Recommended Video

అలాంటి కామెంట్లు దారుణం
బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు నేను సినీ, మోడలింగ్ రంగంలో పనిచేశాను. కేవలం ఆఫర్ల కోసమే అమ్మా రాజశేఖర్‌కు దగ్గరయ్యాననే దుష్ర్పచారం చాలా దారుణం. నేను ఎప్పుడూ నా కెరీర్ గురించి, సినిమా ఆఫర్ల గురించి ఆయనతోగానీ మరొకరితో గానీ నేను మాట్లాడలేదు అని దివి చెప్పింది.


Click it and Unblock the Notifications











