బిగ్ బాస్ హౌస్‌లో దివికి చేదు అనుభవం: ఆ సీన్స్ చూపించలేదని రహస్యాన్ని బయట పెట్టింది

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఈ షో ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతకు ముందు పేరున్న కొందరికి ఎనలేని క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. అలా.. ఈ రియాలిటీ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌ హౌస్‌లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

మహేశ్ బాబు సినిమాతో దివికి గుర్తింపు

మహేశ్ బాబు సినిమాతో దివికి గుర్తింపు

నటన మీదున్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది సొట్టబుగ్గల సుందరి దివి వద్యా. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు గ్లామరస్ లుక్‌తో ఈ అమ్మాయి మోడలింగ్ రంగంలో రాణించింది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే ‘లెట్స్ గో', ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ మధ్య మహేశ్ చిత్రం ‘మహర్షి' కీలక పాత్రను పోషించి మెప్పించింది.

అందులోకి ప్రవేశం.. ఆటతో ఆకట్టుకుంది

అందులోకి ప్రవేశం.. ఆటతో ఆకట్టుకుంది

అందం పరంగా ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే దివికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

మధ్యలోనే బయటకు... షోపై విమర్శలు

మధ్యలోనే బయటకు... షోపై విమర్శలు

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వద్యా క్రేజ్ అమాంతం రెట్టింపు అయింది. దీంతో ఆమె ఫైనల్ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ముందే ఎలిమినేట్ అయిపోయింది. ఆ సమయంలో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చెలరేగాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. ఈ క్రమంలోనే గత వారం జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు చెప్పారు.

బిగ్ బాస్ హౌస్‌లో దివికి చేదు అనుభవం

బిగ్ బాస్ హౌస్‌లో దివికి చేదు అనుభవం

తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది దివి. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. ‘స్వాతి దీక్షిత్ హౌస్‌లో ఉన్నప్పుడు చూసుకోకుండా గ్లాస్‌ను గుద్దుకుంది. అప్పుడు ఆమె ముఖానికి ఉన్న మేకప్ దానికి అంటుకుంది. అది చూసి నేను దెయ్యం అనుకుని భయంతో కింద పడిపోయాను' అని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ సీన్స్ చూపించలేదని బయట పెట్టింది

ఆ సీన్స్ చూపించలేదని బయట పెట్టింది

దీనిని కొనసాగిస్తూ.. ‘అది చూసిన తర్వాత చాలా సేపు ఏడూస్తూనే ఉన్నా. డాక్టర్ కావాలని బిగ్ బాస్‌ను అడగడంతో నన్ను లోపలికి పిలిచారు. ఆ సమయంలో భయంతో నాకు వాంతులు కూడా అయ్యాయి. అప్పుడు డాక్టర్ ఇంజక్షన్ చేసి ఓఆర్ఎస్ తాగించారు. అప్పటి నుంచి ఓ రోజు మొత్తం అక్కడే ఉన్నా. దీంతో నేను ఎలిమినేట్ అయ్యా అనుకున్నారు. ఇవేమీ మీకు చూపించలేదు' అని షాకింగ్ కామెంట్స్ చేసింది దివి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X