దివి వాద్యాపై చిరు ఎఫెక్ట్: ఏకంగా ఆ మూడు సినిమాల్లో హీరోయిన్‌గా.. మేటర్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
కెరీర్ ఆరంభంలోనే పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది తెలుగు బ్యూటీ దివి వాద్యా. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో పాటు తన అందంతో ఎంతో మందిని మాయ చేసిన ఈ భామ.. షోలో గెలవకున్నా ఫాలోయింగ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి సినీ పెద్దలనే విస్మయానికి గురి చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఎన్నో సినిమాలు.. మహేశ్ బాబు వల్ల ఫేమస్
ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగల టాలెంట్ ఉన్న అమ్మాయి దివి వాద్యా. ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.

బిగ్ బాస్ ఎంట్రీతో మారింది... అందానికి ఫిదా
మహేశ్ బాబుతో సినిమా చేసిన తర్వాత దివి వాద్యా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుని నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

దివిని పంపేశారు.. నిర్వహకులపై విమర్శలు
ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లోకి వచ్చిన దివి.. అసాధారణ ఆటతీరుతో అదరగొట్టింది. దీంతో ఆమె టాప్-5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ముందే ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, షో నిర్వహకులపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

బాస్ వల్ల పెరిగిన క్రేజ్.. వరుస ఆఫర్లతో బిజీ
బిగ్ బాస్ షో వల్ల దివి రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

దివికి ఫ్లాటైపోయిన చిరు.. పవర్ స్టార్ కూడా
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన రాబోయే సినిమా (వేదాళం రీమేక్)లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమాలోనూ ఛాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video

ఏకంగా ఆ మూడు సినిమాల్లో హీరోయిన్‌గా
మెగాస్టార్‌నే మాయ చేసిన దివికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఓ లవ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోన్న ఈ భామ.. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ నేడు ప్రారంభం కానుంది. అలాగే, 'లంబసింగి' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లోనూ చేయనుంది. అమ్మడి దూకుడికి అంతా షాకవుతున్నారు.


Click it and Unblock the Notifications











