చిన్నిగౌనులో అందాలు ఆరబోస్తూ రచ్చ రేపిన దివి.. నాకిదిష్టం, మీకేదిష్టం?
నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంటర్ అయ్యేదాకా దివి వద్యా అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక రకంగా ఆమె ఈ షో ద్వారానే తెలుగు ప్రేక్షకులందరికీ ఆమె పరిచయమైంది. సినిమాల్లో అవకాశాల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోషూట్ చర్చనీయాంశంగా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే

మహర్షితో ఎంట్రీ
బిగ్ బాస్ లోకి ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుతో మహర్షి అనే సినిమాలో నటించింది దివి. చేస్తే హీరోయిన్ లాగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తానని ముందు నుంచి భీష్మించుకుని కూర్చున్న ఆమె వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చిన్న పాత్ర అయినా చేసేసింది.

బిగ్ బాస్ క్రేజ్
అయితే ఆ తర్వాత ఆమెకు పెద్దగా గుర్తింపు తగ్గకపోవడంతో ఈసారి చేస్తే మంచి లెంత్ ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని ఆమె ఫిక్స్ అయింది. అయితే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండే ఈ భామ కు మంచి ఫాలోయింగ్ కూడా తోడు కావడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ నిర్వాహకులు ఈమెని హౌస్ లోకి తీసుకువెళ్ళారు.

మెగా ఛాన్స్
అక్కడ తనదైన అందంతో ఆకర్షించిన ఆమె అందరికీ దగ్గరైంది. బిగ్ బాస్ ఫినాలేలో చిరంజీవి సైతం ఆమె అందాన్ని పొగుడుతూ తన తర్వాత సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడం హైలైట్. ఇక ఆమె మెహర్ రమేష్ చిరంజీవి కాంబినేషన్ సినిమా లో నటించబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.

మీకు ఏది ఇష్టం
కానీ తాజాగా ఈ భామ షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పటికప్పుడు తమ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు బుల్లి గౌనులో కూర్చుని ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కుర్చీలో కూర్చుని పేపర్ తిరగేస్తూ ఉన్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చి సుడోకు ఆడడం అంటే ఇష్టం అని పేర్కొంటూ మీకు ఏది ఇష్టం అని ప్రశ్నిస్తోంది.
Recommended Video

చిలక ముక్కు చిన్నది
అయితే ఈ అమ్మడు ఆరబోసేందుకు ఇది ఒక దారి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ భామ చేసిన చిలక ముక్కు చిన్నది అనే ఒక ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాక పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











