యాంకర్ సుమతో రాజీవ్ కనకాల విడాకులు.. కొడుకు రోషన్ కు తెలియడంతో

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1995 నుంచి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. 30 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక రాజీవ్ కనకాల సౌత్ స్టార్ యాంకర్ సుమను తన కెరీర్ ప్రారంభమైన నాలుగేళ్లకే పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

సుమ కనకాల రాజీవ్ కనకాల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు రోషన్ కనకాల ప్రస్తుతం హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టి ప్రేక్షకులను మెప్పించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అటు సుమా కనకాల భారీ ప్రాజెక్ట్ ల ఈవెంట్లను, మరోవైపు టెలివిజన్ లో సుమ అడ్డ షోను విజయవంతంగా రన్ చేస్తోంది. సక్సెస్ఫుల్ యాంకర్ గా ఎప్పుడూ ముద్ర వేసుకున్న సుమ ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తుంది. అటు రాజీవ్ కనకాల కూడా బిగ్గెస్ట్ మూవీస్ లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Divorce with Anchor Suma Kanakala Her Husband Rajeev Kanakala Reacted on it

అయితే రాజీవ్ కనకాల సుమ మధ్య విభేదాలు వచ్చాయని, మాట మాట పెరిగి ఆ గొడవ కాస్త విడాకుల వరకు వెళ్లిందని అప్పట్లో పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరు విడిపోవాలని నిర్ణయానికి ఎందుకు వచ్చారని అంతా ఆశ్చర్యపోయారు. దానిపై పెద్దగా ఎవరు స్పందించలేదు. సుమ కనకాల మాత్రం వాటిని కొట్టిపారేస్తూ తన భర్త పై పొగడ్తల వర్షం కురిపించడం ప్రారంభించింది.

అయితే రీసెంట్ గా బిగ్ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాల డీవోర్స్ విషయంపై స్పందించారు. జబర్దస్త్ వర్ష యాంకర్ గా రన్ అవుతున్న ఆ టాక్ షోలో రాజీవ్ కనకాలకు సుమకు మధ్య ఉన్న ఆ ఘర్షణ ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. దానిపై రాజీవ్ కనకాల స్పందించారు. అలాంటి ఘర్షణ ఏమీ లేదని తెలిపారు. కానీ డివోర్స్ రూమర్లు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేసింది అని చెప్పారు. అలాంటి వార్తలు రావడం వల్ల ఇంట్లో గొడవలు జరిగాయని, తన కొడుకు రోషన్ విషయం తెలుసుకొని వచ్చి తనపై ఫైర్ అయ్యాడని చెప్పారు. తన కొడుకు కూడా ఎంతో బాధపడ్డాడని తెలిపారు.

తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆ పుకార్లు అన్నీ అవాస్తవమని తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే రోషన్ మాత్రం చాలా బాధపడ్డాడని చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాల చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో ముకుంద పాత్రలో నటించారు. ఆ తర్వాత బ్రహ్మానందం, ఆయన కొడుకు కలిసి నటించిన చిత్రం 'బ్రహ్మానందం'లోనూ నటించి అలరించారు. ఆ తర్వాత 'తాలా' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X