‘అతనితో క్లోజ్‌గా రీతూ చౌదరి.. ఆమె ఫ్యామిలీయే బాత్‌రూంలోకి తీసుకెళ్లమని’
బిగ్‌బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి తన మార్క్ చూపించారు. హౌస్‌లో ఉన్నది 3 వారాలే అయినా ఎవరికి తలొగ్గకుండా, ఎవరిని కాకపట్టకుండా తన గేమ్ తాను ఆడారు. మరికొద్దిరోజులు ఆమె హౌస్‌లో ఉంటే మజాగా ఉండేదని బిగ్‌బాస్ లవర్స్ అభిప్రాయపడ్డారంటే మాధురి గేమ్ అర్ధం చేసుకోవచ్చు. ఎలిమినేషన్ తర్వాత వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న దివ్వెల మాధురి.. హౌస్‌లోని కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రీతూ చౌదరిపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
కోరుకున్నట్లు గానే ఎలిమినేషన్
నిజానికి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ టీం అనుకోలేదట. తనంతట తానుగా ఎలిమినేట్ అవ్వాలని అనుకుంది. ఈ విషయాన్ని మాధురి ఎలిమినేషన్ రోజే బయటపెట్టారు. తనను నామినేట్ చేయాలని మాధురి అందరినీ అడిగింది.. అందరూ ససేమిరా అనడంతో చివరికి తనూజ ద్వారా నామినేషన్స్‌లోకి వచ్చింది.. ఆ తర్వాత తనకు ఓట్లు వేయొద్దని, నవంబర్ 4న తన భర్త దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే ఉందని ఆరోజు నేను ఆయన పక్కనే ఉండాలని కెమెరాల వైపు చూస్తూ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి తను అనుకున్నట్లుగానే మాధురి ఎలిమినేటై బయటకు వచ్చేశారు.

రీతూ చౌదరి vs దివ్వెల మాధురి
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే తన రూల్స్ అమలు చేయడం మొదలుపెట్టిన మాధురిపై రీతూ చౌదరి మండిపడింది. రోజూ ఏదో విషయంలో గొడవపడేది.. ఇక నామినేషన్స్ రోజూ ఇద్దరి మధ్య వాదనలు పీక్స్‌కు చేరేవి. అటు రీతూ కూడా ఏమాత్రం తగ్గకుండా మాటకు మాట బదులిస్తూ మాధురిపై పంచులు విసురుతూ వచ్చింది. ముఖ్యంగా పవన్, డిమోన్ పవన్‌లతో రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జనానికి విసుగు తెప్పించడంతో పాటు రీతూపై బాగా నెగిటివిటీ కనిపించింది. అయితే మాధురితో గొడవ కారణంగా ఆమె తిరిగి ఓట్లు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
రీతూ చౌదరి తల్లి ఏడుస్తోంది
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత మాధురి ఇంటర్వ్యూల కోసం మీడియా జనాలు ఎగబడుతున్నారు. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ చౌదరిపై మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. రీతూ చిన్న పిల్లా? ఒకసారి చూడండి ఆవిడ ఇంటర్వ్యూలు, ఆవిడవి బయటివన్నీ చూడండి. డిమోన్ పవన్‌తో రీతూ చౌదరిది హెల్దీ రిలేషన్‌షిప్ అయితే వాళ్ల ఫ్యామిలీ నుంచే ఒకరు ఫోన్ చేసి.. ప్లీజ్ దయచేసి రీతూ చౌదరిని బాత్‌రూంలోకి తీసుకెళ్లి మెల్లగా డిమోన్‌తో మాట్లాడొద్దని చెప్పండి, ఇంట్లో వాళ్లమ్మ దొర్లి దొర్లి ఏడుస్తోందన్నారు. వాళ్ల అమ్మకే అది అన్ హెల్దీగా అనిపించినప్పుడు, పక్కనే ఉన్న ఓ మదర్‌గా నాకూ అన్ హెల్దీగానే అనిపిస్తుందని మాధురి చెప్పారు.
మా ఆయన కోసం ఏమైనా వదులుకుంటా?
రీతూ చౌదరికి పెళ్లయి ఆల్రెడీ డైవర్స్డ్ .. ఒకసారి పెళ్లయిపోయి డైవర్స్ అయిపోయి మళ్లీ వెళ్లి, మళ్లీ వస్తే చిన్న పిల్లా?. వాళ్లు స్క్రీన్ స్పేస్ కోసం అలా నటించడం అన్ ఫెయిర్, అన్ హెల్దీయే అని మాధురి అన్నారు. ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిమోన్ కోసం రీతూ వదులుకుంటుందా? ఫైనల్‌కి వెళ్లారు అనుకుందాం.. రీతూ కోసం పవన్ వదులుకుంటాడా అని ప్రశ్నించారు. నేను మా ఆయన కోసం ఏదైనా వదులుకుంటా? ఇప్పటికే నేను మా ఆయన కోసం చాలా వదులుకున్నాను అని మాధురి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











