బిగ్‌బాస్‌పై దువ్వాడ ఫైర్.. ఆడ, మగ మధ్య ఆటలేంటీ? సమాజానికి ఏం చూపిస్తున్నారంటూ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ఎన్నాడు చూడని ట్విస్టులు, సర్రైజ్‌లతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ మారింది. తాజాగా హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సీజన్‌లోకి తాజాగా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్, శ్రీనివాస్ సాయిలతో పాటు టీవీ సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా లు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇంట్రెస్టింగ్ సాగుతోన్న బిగ్ బాస్ షోపై దివ్వెల మాధురి ప్రియుడు, వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై షోపై అసహనం వ్యక్తంచేశారు. షోలో జరుగుతున్న గేమ్స్, కంటెంటు, ప్రవర్తనలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిగ్ బాస్ హౌస్‌లో రాంగ్ రిలేషన్స్ పెట్టుకోకూడదని బిగ్ బాస్ జాతిని ఉద్దేశించి భారీ ఉపన్యాసం ఇచ్చారు. ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ షోలో ఆడవారికి, మగవారికి మధ్య పెట్టే గేమ్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. బిగ్ బాస్ టీంకు కామన్ సెన్స్ ఉందా?" అంటూ ఆయన ప్రశ్నించారు.

"మగవారికి శారీరక బలం ఎక్కువ. ఆడవారికి ఆలోచన శక్తి, ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. ఆడ మగ మధ్య ఫిజికల్ గేమ్స్ పెట్టడం సరైన పద్ధతి కాదు. అది గేమ్ కాదు, అది సమాజానికి తప్పు సందేశం ఇస్తుంది" అని దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు 'గేమ్ అంటే దానివల్ల కొంత జ్ఞానం, నైపుణ్యం రావాలి. కానీ బిగ్ బాస్‌లో ఆడిస్తున్న ఆటల్లో ఏ స్కిల్, నాలెడ్జ్ కనిపించడం లేదు. కేవలం ఫేక్ డ్రామాలు, నకిలీ రిలేషన్స్, నెగటివ్ కంటెంట్ మాత్రమే చూపిస్తున్నారు. ఇది ఎంటర్టైన్‌మెంట్ కాదు, ఫేక్ గేమ్'అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ల ప్రవర్తనపైనా దువ్వాడ విమర్శలు గుప్పించారు. 'ఇప్పటి హౌస్‌లో ఉన్న వాళ్లందరూ ఫేక్ రిలేషన్స్, ఫేక్ ఫేసెస్‌తో గేమ్ ఆడుతున్నారు. టైటిల్ కోసం డ్రామాలు చేస్తూ, జీవితాలు పోయినట్లు నటిస్తున్నారు. అలా ఆడి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?'అని ప్రశ్నించారు. మిగితా కంటెస్టెంట్లను విమర్శించిన ఇమాన్యుల్ పై మాత్రం ప్రశంసలు కురిపించారు. అతడు మాత్రమే నిజాయతీగా ఆడుతున్నాడు. అతను ఎవరినీ కించపరచకుండా, అందరినీ నవ్విస్తూ, బాధలో ఉన్నవారిని ఓదారుస్తున్నాడు. అదే అసలైన లీడర్ షిప్. టైటిల్ గెలవడం కంటే మనిషిగా నిలబడటమే పెద్ద విషయం'అని దువ్వాడ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై కూడా ఆయన స్పందించారు. "బిగ్ బాస్ ద్వారా సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ రియాలిటీ షోలో పలు ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి. కొందరు కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారు, ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ తప్పు. ఇది నిజమైన గేమ్ కాదు, మానవ విలువలను దిగజార్చే ప్రదర్శన'అని దువ్వాడ విమర్శించారు.
ఇలాంటి కాంట్రవర్సీలు ఉన్నా ఈ షోలోకి మాధురి ఎందుకు పంపించారని ప్రశ్నించగా.. 'మాధురిని బిగ్ బాస్ షోలోకి పంపించడానికీ ఇదే కారణం. ఆమె ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాం. కల్చర్, బిహేవియర్, గేమ్ స్పోర్ట్స్ ఎలా ఉండాలో చూపించడానికి మాధురి ప్రయత్నిస్తోంది'అని దువ్వాడ స్పష్టం చేశారు.
ప్రస్తుతం దువ్వాడ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లగానే.. కంటెస్టెంట్స్ అందరికీ కలిపి టాస్క్ పెట్టారు. అందులో ఆడ మగా కలిసి ఆడారు. ఆ గేమ్ లోఒకరి మీద ఒకరు పడినట్టు ఆడుతున్నారు. అయితే ఆ ఆటను చూసి దువ్వాడ మాధురి ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ హర్ట్ అయిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











